గుండెపోటుతో దుండిగ‌ల్ ఎస్ఐ మృతి

గుండెపోటుతో దుండిగ‌ల్ ఎస్ఐ మృతి

ఈ రోజుల్లో గుండెపోటు సర్వసాధారణమైపోయింది. క్రికెట్ ఆడుతూ, హల్దీ ఫంక్షన్ లో, డ్యాన్స్ చేస్తుండగా, పాఠాలు చెప్తుండగా.. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలా మంది గుండెపోటు, కార్డియాక్ అరెస్టులతో ప్రాణాలు కోల్పోతున్నారు.

కొవిడ్ తర్వాత గుండెపోటు మరణాలపై మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. అప్పటివరకు బాగానే ఉన్న మనిషి ఒక్కసారిగా కుప్పకూలుతున్నాడు. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉంది. క్షణకాలంలోనే ఊహించని ఘటనలు చోటుచేసుకుంటున్నారు. అదే తరహాలో హైదరాబాద్ లోని దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోన్న సీఐ గుండె పోటుతో మరణించారు.

సబ్‌ఇన్‌స్పెక్టర్ జూన్ 8న రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. గండి మైసమ్మకు చెందిన ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి తన కుటుంబ సభ్యులకు రాత్రి 9 గంటల ప్రాంతంలో ఛాతి నొప్పి వస్తుందని చెప్పారు. కుటుంబసభ్యులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రభాకర్ రెడ్డి 2014 బ్యాచ్ ఎస్‌ఐ కాగా అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.