
రంగులతో ఆనందమయంగా జరగాల్సిన హోలీ పండుగ మెదక్ జిల్లాలో విషాదం నింపింది. సరదాగా ఆడాల్సిన హోలీ కాస్త గొడవకు దారి తీసింది. ఇద్దరి వ్యక్తుల మధ్య గొడవ కాస్తా పెద్దదయ్యింది. రేగోడ్ మండలం మర్పల్లిలో హోలీ వేడుకల్లో భాగంగా అంజయ్య అనే వ్యక్తి షబ్బీర్ అనే వ్యక్తిపై రంగు పోసేందుకు యత్నించాడు. దీంతో ఆగ్రహంతో షబ్బీర్ అంజయ్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో అంజయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు షబ్బీర్ కు అంజయ్యకు మధ్య పాత కక్షలేవైనా ఉన్నాయా? లేక యాక్సిడెంటల్ గా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.