14న ట్యాంక్​బండ్ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు

14న ట్యాంక్​బండ్ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
  • 14న ట్యాంక్​బండ్ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
  • అంబేద్కర్ విగ్రహావిష్కరణ నేపథ్యంలో వెహికల్స్ దారి మళ్లింపు
  • మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు అమలు

హైదరాబాద్‌, వెలుగు : అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఇయ్యాల మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ట్యాంక్​బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ చీఫ్ సుధీర్ బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించిన నోటిషికేషన్​ను గురువారం రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ మార్గ్, ఎన్టీఆర్ గార్డెన్స్, నెక్లెస్ రోడ్, మింట్ కాంపౌడ్ రోడ్, లుంబినీ పార్కును మూసి వేయనున్నట్లు ప్రకటించారు.

ఖైరతాబాద్​లోని జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ రూట్​లో వెహికల్స్​కు అనుమతి లేదన్నారు. ఖైరతాబాద్‌, రాణిగంజ్‌, లిబర్టీ, తెలుగు ఫ్లై ఓవర్ నుంచి వెహికల్స్ ను దారి మళ్లిస్తామని.. వాహనదారులు సహకరించాలని కోరారు.

ట్రాఫిక్ డైవర్షన్స్ ఇలా..

  • ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి నెక్లెస్​రోడ్ వైపు వెళ్లే వెహికల్స్ షాదన్ కాలేజ్, నిరంకారీ భవన్, లక్డీకపూల్ మీదుగా వెళ్లాలి.
  • ట్యాంక్​బండ్ నుంచి పీవీఆర్ మార్గ్, ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వెహికల్స్ రాణిగంజ్, కర్బాల మైదాన్ మీదుగా వెళ్లాలి.
  • రసూల్​పురా, మినిస్టర్ రోడ్, నుంచి ట్రాఫిక్​ను నల్లగుట్ట జంక్షన్, రాణిగంజ్ వైపు దారి మళ్లించనున్నారు.
  • ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి ట్యాంక్​బండ్, రాణిగంజ్, లిబర్టీ వైపు వచ్చే వెహికల్స్ తెలుగుతల్లి ఫ్లై ఓవర్, కట్టమైసమ్మ జంక్షన్, లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా వెళ్లాలి.
  • బీఆర్కే భవన్, ట్యాంక్​బండ్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వెహికల్స్ ను తెలుగు తల్లి ఫ్లై ఓవర్ జంక్షన్, ఇక్బాల్ మినార్ వైపు దారి మళ్లించనున్నారు.
  • ఖైరతాబాద్ బడా గణేశ్ లేన్ నుంచి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్ మీదుగా నెక్లెస్ రోడ్ వైపు వచ్చే వెహికల్స్​ను రాజ్​దూత్ లేన్ వైపు దారి మళ్లించనున్నారు.
  • అఫ్జల్​గంజ్ నుంచి ట్యాంక్​బండ్ మీదుగా సికింద్రాబాద్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను తెలుగుతల్లి ఫ్లై ఓవర్, కట్టమైసమ్మ టెంపుల్, లోయర్ ట్యాంక్ బండ్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ మీదుగా పంపించనున్నారు.