ఐపీఎల్ కు బ్రావో గుడ్ బై.. ఇక చెన్నై బౌలింగ్ కోచ్ గా..

ఐపీఎల్ కు బ్రావో గుడ్ బై.. ఇక చెన్నై బౌలింగ్ కోచ్ గా..

చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు. తో అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ గా  సీఎస్కే ప్రాంచైజీ ఎంపిక చేసింది. బ్రావోను బౌలింగ్ కోచ్‌గా నియమించిన విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతో లక్ష్మీపతి బాలాజీ ఏడాదిపాటు కోచింగ్‌కు దూరంగా ఉండనుండటంతో.. అతడి స్థానంలో బ్రావో తమ బౌలింగ్ కోచ్ గా వ్యవహరిస్తాడని తెలిపింది.

గత కొన్నేళ్లుగా  చెన్నై తరపున ఆడిన బ్రావో..ఐపీఎల్ లో  అత్యధిక వికెట్లు(183) తీసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.  161 మ్యాచ్ లు ఆడిన బ్రావో 1560 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2013, 2015 సీజన్లో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ కూడా అందుకున్నాడు. 2011 నుంచి సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న బ్రావో.. ఆ జట్టు 2011, 2018, 2021ల్లో ఐపీఎల్ టైటిల్ సాధించాడు.

ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్ కూడా ఇటీవలే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ అతణ్ని తమ బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లలో బ్రావో కూడా ఒకడు.