హైదరాబాద్, వెలుగు: ఫెస్టివల్ గిఫ్టింగ్ కోసం గోల్డ్ వోచర్స్ అందుబాటులోకి తెచ్చామని ఈ–కామర్స్కంపెనీ అమెజాన్ ప్రకటించింది. ఫిన్ టెక్ కంపెనీ పైన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వీటిని జారీ చేస్తుంది. ‘‘అమెజాన్ గోల్డ్ వోచర్ విలక్షణమైన ప్రీపెయిడ్ డాక్యుమెంట్. వీటితో అమెజాన్ నుంచి కల్యాణ్, ఎంటీసీ, తనిష్క్, జోయాలుక్కాస్ వంటి బ్రాండ్ల నగలను, కాయిన్స్‌ను కొనుక్కోవచ్చు.
ఈ వోచర్స్ టియర్ 2. టియర్ 3 పట్టణాలు సహా భారతదేశంలోని ఏడు వేల పిన్ కోడ్‌లలో లభ్యమవుతాయి”అని సంస్థ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ఇదిలా ఉంటే, అమెజాన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్, ఇండియా పోస్ట్) దేశవ్యాప్తంగా డెలివరీల కోసం భాగస్వామ్యాన్ని ప్రకటించాయి.