ఈ–కామర్స్​, టెలికాం, బీఎఫ్​ఎస్, ఐటీ సెక్టార్‌‌‌‌ ఉద్యోగాలకు మస్తు డిమాండ్​

ఈ–కామర్స్​, టెలికాం, బీఎఫ్​ఎస్, ఐటీ సెక్టార్‌‌‌‌ ఉద్యోగాలకు మస్తు డిమాండ్​
  • వెల్లడించిన అప్నా సర్వే 

న్యూ ఢిల్లీ: ఉపాధి కోసం ఎదురుచూసే  ఫ్రెషర్లు.. ఈ–కామర్స్​, టెలికమ్యూనికేషన్స్, బీఎఫ్​ఎస్​ఐ (ఫైనాన్షియల్‌‌),  ఐటీ సెక్టార్లలో ఉద్యోగాలను కోరుకుంటున్నారని వెల్లడయింది.ఈ రంగాల్లో కెరీర్‌‌‌‌‌‌‌‌ బాగుంటుందని భావిస్తున్నారు. వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, వర్క్​–లైఫ్ ​బ్యాలెన్స్​ బాగుంటుందని చెబుతున్నారు.  జాబ్  ప్రొఫెషనల్ నెట్‌‌‌‌‌‌‌‌వర్కింగ్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్ అప్నా సర్వే ప్రకారం, ఈ–కామర్స్ జాబ్స్​కు వస్తున్న అప్లికేషన్‌‌‌‌‌‌‌‌లలో 22 శాతం పెరుగుదల ఉంది. బీఎఫ్​ఎస్​ఐ రంగం 18 శాతం వృద్ధిని కనబరచగా, టెలికమ్యూనికేషన్స్,  ఐటీ రంగాల్లో వరుసగా 13 శాతం,  5 శాతం పెరుగుదల కనిపించింది.

సూరత్, జైపూర్, గ్వాలియర్, భోపాల్, ఇండోర్, లక్నో  కాన్పూర్ వంటి టైర్ 2,  3 నగరాలకు చెందిన ఫ్రెషర్లలో ఎక్కువ మంది బీఎఫ్​ఎస్​ఐ, ఈ–కామర్స్​‌‌‌‌‌‌‌‌కంపెనీలపై దృష్టి సారిస్తున్నారు. మొత్తం పది వేల మంది అభిప్రాయాలతో సర్వే చేశామని అప్నా డాట్​ తెలిపింది. గణనీయమైన కెరీర్ వృద్ధి అవకాశాల కారణంగా ప్రతి 10 మంది ఫ్రెషర్‌‌‌‌‌‌‌‌లలో ఆరుగురు ఈ రంగాలకు ఆకర్షితులయ్యారు. దాదాపు 34 శాతం మంది  కంపెనీలు అందించే స్థిరత్వానికి ప్రాధాన్యం ఇస్తుండగా, 22 శాతం మంది  బ్రాండ్, గుర్తింపునకు ఇంపార్టెన్స్​ఇస్తున్నారు.

అంతేకాకుండా, ప్రతి 10 మందిలో 8 మంది అమెజాన్, ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్  రిలయన్స్ జియో వంటి కంపెనీల్లో ఉద్యోగాలను కోరుతున్నారు. దాదాపు 38 శాతం మంది కంపెనీల్లో మెరుగైన వాతావరణం,  పని–-జీవిత  సమతుల్యతను అందించే జాబ్స్​పై ఆసక్తి చూపుతున్నారు. వృత్తిపరమైన వృద్ధిపై మాత్రమే కాకుండా మొత్తం శ్రేయస్సు ముఖ్యమని స్పష్టం చేశారని  అప్నా  సీఈఓ నిర్మిత్ పారిఖ్ చెప్పారు.