భారీగా కటౌట్లు ఏర్పాటు చేసిన మునుగోడు టికెట్ ఆశావహులు

భారీగా కటౌట్లు ఏర్పాటు చేసిన మునుగోడు టికెట్ ఆశావహులు

చౌటుప్పల్, వెలుగు : మునుగోడులో సీఎం కేసీఆర్ శనివారం నిర్వహించనున్న బహిరంగ సభకు టికెట్ ఆశావహులు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని సభలోనే సీఎం ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుండటంతో.. కేసీఆర్ దృష్టిలో పడేందుకు భారీగా కటౌట్లు పెట్టించారు.

చౌటుప్పల్ మండలం నుంచి నారాయణపురం వరకు రోడ్డుకు ఇరువైపులా మునుగోడు ఇన్​చార్జ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కంచర్ల కృష్ణారెడ్డి తదితరులు భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌‌లు ఏర్పాటు చేశారు. చౌటుప్పల్ మండల కేంద్రంలో కర్నె ప్రభాకర్ భారీ కటౌట్ పెట్టించగా.. రోడ్డుకు ఇరువైపులాఫ్లెక్సీలను కూసుకుంట్ల ఏర్పాటు చేశారు. కంచర్ల కృష్ణారెడ్డి హోర్డింగ్స్ పెట్టించారు.