‘సన్’ డే.. సూర్యుడికి 50 లక్షల కిలోమీటర్ల దగ్గరగా భూమి: జరిగే మార్పులేంటీ?

‘సన్’ డే.. సూర్యుడికి 50 లక్షల కిలోమీటర్ల దగ్గరగా భూమి: జరిగే మార్పులేంటీ?

కొత్త సంవత్సరం స్టార్టింగ్‌లోనే ఆకాశంలో ఖగోళ అద్భుతం జరగబోతోంది. ఈ ఆదివారం సూర్యుడికి భూమి అత్యంత దగ్గరగా వెళ్తోంది. దాదాపు 50 లక్షల కిలోమీటర్ల మేర తన కక్ష్యలో ముందుకు వస్తోంది. ఈ అద్భుతం రేపు (ఆదివారం) మద్యాహ్నం 1.07 గంటలకు జరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే దీనిని జనం నేరుగా చూడలేరని చెబుతున్నారు. కానీ, దీని విషయంలో జరిగే మార్పులేంటన్న విషయంలో లేనిపోని ప్రచారాలు నమ్మొద్దని సూచించింది ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా.

ఈ సండే.. సన్ డే

ఈ ఆదివారం సూర్యుడికి భూమికి చాలా క్లోజ్‌గా ప్రయాణించే సన్ డే అని చెప్పాలి. నేడు (శనివారం) సూర్యుడిని నుంచి భూమి 15 కోట్ల 20 లక్షల 95 వేల 302 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో ప్రయాణిస్తోంది. దీనిని ఖగోళ పరిభాషలో అఫెలియన్ అని పిలుస్తారు. అదే జనవరి 5న ఆదివారం దీనికి పూర్తి భిన్నంగా జరుగుతుంది. దీర్ఘ వృత్తాకార కక్ష్యలో సూర్యుడి చుట్టూ తిరిగే భూమి 50 లక్షల 4 వేల 153 కిలోమీటర్ల ముందుకు వస్తుంది. అంటే 14 కోట్ల 70 లక్షల 91 వేల 149 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో ప్రయాణం చేస్తుంది భూమి. దీనిని ఫెలియన్ అంటారు. అయితే ఈ అద్భుత ఘట్టాన్ని నేరుగా చూడలేమని శాస్త్రవేత్తలు తెలిపారు.

‘సన్ డే’ మార్పుల గురించి..

సూర్యుడికి భూమి దగ్గరగా వెళ్లడం వల్ల ఎండ మండిపోద్దన్న భయం మనందరిలో కామన్. కానీ అలాంటిదేం ఉండదని శాస్త్రేవేత్తలు చెబుతున్నారు. సూర్యుడికి భూమికి మధ్య దూరానికి వాతావరణంలో మార్పులకు ఏ సంబంధలేదని స్పష్టం చేశారు. ఈ ఖగోళ అద్భుతంపై విద్యార్థులు, ప్రజలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్. శ్రీరఘునంద్ కుమార్ అన్నారు. సూర్యుడికి భూమికి మధ్య దూరం తగ్గుతుందనగానే వాతావరణంలో అసాధారణ మార్పులు వస్తాయన్న ఫీలింగ్ ఉంటుందని, అది తప్పని ఆయన చెప్పారు. ఆదివారం జరిగే ఖగోళ అద్భుతంతో కొత్తగా ఎండ, చలిలో వచ్చే మార్పులేం ఉండవని తెలిపారు.

సీజన్, టెంపరేచర్ మార్పులకు మూలమేంటి?

సాధారణంగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ.. సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంటుంది. అయితే ఇలా తిరిగేటప్పుడు రెండింటి మధ్య ఉంటే దూరానికి సీజన్లు, ఉష్ణోగ్రతల్లో మార్పులకు ఏ మాత్రం సంబందం ఉండదు. సూర్యుడి చుట్టూ భూమి తిరిగేటప్పుడు 23.5 డిగ్రీల కోణంలో ఒక వైపు వంగి పరిభ్రమణం చేస్తుండడమే సీజన్లలో మార్పునకు మూలం. భూమి ఒకసారి సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టే టైం సంవత్సరం. ఈ సమయంలో అలా వంగి తిరడగం వల్ల సూర్యుడికి ఫేస్ అయ్యి ఉండే వైపు వేసవి కాలం ఉంటుంది. తర్వాత భూమి రొటేషన్‌లో రెండో వైపు ఫేస్ అయినప్పుడు మొదటి హెమీ స్పియర్‌లో వింటర్ సీజన్ (చలికాలం) వస్తుంది.

సో, రేపు (ఆదివారం) భారత్‌లో (నార్త్ హెమీస్పియర్‌లో ఉన్న ఇండియా సహా అన్ని దేశాల్లోనూ) యథావిధిగా చలికాలంలో ఉన్న టెంపరేచర్సే ఉంటాయి. భూమికి దక్షిణ భాగంలో ఉన్న ఆస్ట్రేలియా సహా అన్ని దేశాల్లో  వేసవి ప్రభావం ఉంటుంది. ఈ ఏడాది జూలైలో సూర్యుడికి భూమి అత్యంత దూరంగా ఉంటుంది. అయినా ఆ సమయంలో భారత్‌లోని చాలా ప్రాంతాల్లో జనవరి నెలతో పోలిస్తే చాలా వేడిగా ఉంటుంది. దీన్ని బట్టి సూర్యుడికి, భూమికి మధ్య దూరంతో సీజన్, ఉష్ణోగ్రతల మార్పులకు ఏ సంబంధం లేదని క్లియర్‌గా తెలుస్తోంది.

5, 6 తేదీల్లో మరో అద్భుతం చూసే చాన్స్

కొత్త సంవత్సరం తొలి వారంలోనే అంతరిక్షంలో రెండో అద్భుతం కూడా జరుగుతోంది. జవనరి 4, 5, 6 తేదీల్లో భారీ ఉల్కాపాతాన్ని ఆవిష్కృతమవుతోంది. అయితే సూర్యుడు, భూమి దగ్గరగా రావడం చూడలేకపోయినప్పటికీ.. ఉల్కాపాతం వెలుగు జిలుగుల్ని తెల్లవారు జామున మనం చూడొచ్చు.

ఏ టైమ్‌లో.. ఎలా?

ఈ మూడు రోజుల్లో తెల్లవారు జామున 3 గంటల నుంచి అద్భుతమైన భారీ ఉల్కాపాతం చూడొచ్చు. తూర్పు, ఈశాన్య దిక్కుల మధ్యలో చందమామ అస్తమిస్తున్న వేళ భారీ వెలుగులు భూమికి రాలుతున్నట్లు కనిపిస్తుంది. టెలిస్కోప్ లాంటి వాటిలో దీన్ని చూస్తే చాలా అందంగా వెలుగులీనుతూ కనిపిస్తుంది.