వేకువజామున కశ్మీర్ లోని కాత్రాలో ఎర్త్ క్వేక్

వేకువజామున కశ్మీర్ లోని కాత్రాలో ఎర్త్ క్వేక్

జమ్మూ కశ్మీర్ లోని కాత్రా పట్టణంలో సోమవారం వేకువజామున 2 గంటల 20 నిమిషాలకు స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.9గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది.

భూకంప కేంద్రం కాత్రా పట్టణానికి తూర్పు దిశగా 61 కిలోమీటర్ల దూరాన, 10 కిలో మీటర్ల లోతులో ఉందని తెలిపింది. దీనికి సంబంధించిన మ్యాప్ ను కూడా నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ విడుదల చేసింది. అయితే దీనివల్ల ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలుస్తోంది.