ఇండియా సహా ఐదు దేశాల్లో భూకంపం..విరిగిపడిన కొండచరియలు, ఊగిన భవనాలు

ఇండియా సహా ఐదు దేశాల్లో భూకంపం..విరిగిపడిన కొండచరియలు, ఊగిన భవనాలు

ఇండియాతో సహా ఐదు దక్షిణాసియా దేశాల్లో గురువారం ( జనవరి 11) భూకంపం సంభవించింది. ఇండియా, పాకిస్థాన్, ఆఫ్ఝనిస్తాన్, తజకిస్తాన్, ఉజ్ బెకిస్తాన్ దేశాల్లో భూమి కంపించింది. భూకంప కేంద్రం ఆఫ్ఝనిస్తాన్ లోని జుర్మ్ కు దక్షిణ ఆగ్నేయంగా 44 కి.మీ దూరంలో ఏర్పడిందని సిస్మోలజీ డిపార్ట్ మెంట్ తెలిపింది. 

భారత దేశ రాజధాని ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలులో భూకంప తీవ్రత 6 (ఆరు)గా నమోదైంది. 2024, జనవరి 11వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాల సమయంలో భూకంపం వచ్చినట్లు ప్రకటించారు అధికారులు. భూకంప కేంద్రం.. భూమికి 192 కిలోమీటర్లలోపల జరిగినట్లు వెల్లడించారు అధికారులు. భూకంప తీవ్రత జమ్మూకాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు ఉంది. 

భూకంప తీవ్రతకు జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో కొండ చరియలు విరిగిపడ్డాయి. అదే విధంగా ఢిల్లీలోని చాలా భవనాలు ఊగాయి. ఇళ్లల్లోని ఫ్యాన్లు ఊగుతున్న విజువల్స్ పోస్టు చేస్తు్న్నారు నెటిజన్లు. భూకంప తీవ్రత 6 గా ఉండటంతో.. ప్రకంపనల తీవ్రతకు ఇళ్లు, ఆఫీసుల్లోని ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఇప్పటికే వరకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు అధికారికంగా వెల్లడి కాలేదు. 

పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ , లాహోర్, దాని పరిసర ప్రాంతాలు , ఖైబర్ ఫఖ్తుంఖ్వాలోని కొన్ని ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్ పై 6.0 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి. ఆఫ్ఝనిస్తాన్ లోని హిందూకుష్ ప్రాంతంలో మధ్యా హ్నం 2.20 గంటలకు 213 కిలోమీటర్ల లోతులో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు డిపార్టుమెంట్ తెలిపింది.