కేసీఆర్ సొంత కూతురును కూడా గెలిపించుకోలేకపోయాడు

కేసీఆర్ సొంత కూతురును కూడా గెలిపించుకోలేకపోయాడు

కేసీఆర్ తన సొంత కూతురుకు భీ ఫాం ఇచ్చానా ఓడిపోయింది కదా అని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. అసలు ఆమెకు బొగ్గగణి కార్మిక సంఘంలో ఏం పని అని ఈటల ప్రశ్నించారు. భూకబ్జా ఆరోపణలతో టీఆర్ఎస్ ప్రభుత్వ నుంచి బర్తరఫ్ చేయబడిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన పదవికి, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఈటల.. సీఎం కేసీఆర్‌పై పలు ప్రశ్నలు సంధించారు. తెలంగాణ గడ్డపై సంఘాలుండొద్దు, సమ్మెలుండొద్దు అని సీఎం కేసీఆర్ అంటున్నరని ఆయన అన్నారు. ధర్నాలు చేస్తున్నారని ధర్నాచౌక్‌ను ఎత్తేసిన చరిత్ర వీళ్లదని.. ఇటువంటి వన్నీ అడిగితే తప్పా అని ఈటల ప్రశ్నించారు. కేసీఆర్ తన కూతురుకు బీ ఫామ్ ఇచ్చినా ఓడిపోయిందని.. తాను మాత్రం గెలిచి వచ్చానని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని తాను ఎమ్మెల్యే అయ్యానని ఆయన అన్నారు. ఉద్యమంలో అనేక సార్లు రాజీనామా చేస్తే చాలా మంది ఓడిపోయారని.. కానీ తనను మాత్రం హుజూరాబాద్ ప్రజలు గెలిపించుకున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ కేవలం డబ్బులను నమ్ముకున్నాడని.. కుట్రలు చేసి ఎన్నికల్లో గెలుస్తున్నడని ఈటల అన్నారు. కుట్రలు, కుతంత్రాలు, డబ్బుల సంచులతో ఎన్నికల్లో గెలవొచ్చు.. కానీ తెలంగాణ ప్రజలు ఆత్మాభిమానం వున్నవాళ్ళని.. వాళ్ల మనుసుల గెలుచుకోలేరని ఆయన అన్నారు.