సచిన్ టెండుల్కర్‌కు కీలక బాధ్యతలు.. మూడేళ్ల పాటు

సచిన్ టెండుల్కర్‌కు కీలక బాధ్యతలు.. మూడేళ్ల పాటు

దేశంలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది. త్వరలోనే ఐదు రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ దిగ్గజం సచిన్ టెండుల్కర్‌కు ఎలక్షన్ కమిషన్(ఈసీ) కీలక బాధ్యతలు అప్పగించనుంది. ఎన్నికల పక్రియలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా.. అవగాహన కల్పించేందుకుగానూ 'నేషనల్​ ఐకాన్'గా నియమించనుంది.

బుధ‌వారం(ఆగష్టు 23న) ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే మరియు అరుణ్ గోయెల్ సమక్షంలో ఈసీ.. సచిన్‌తో ఈ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ ఒప్పదంలో భాగంగా సచిన్.. మూడేళ్ల పాటు ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించనున్నారు.

ఎన్నికల్లో ఓటింగ్​ శాతం పెంచేందుకుగానూ ఎన్నికల కమిషన్.. ప్రముఖ వ్యక్తులను 'నేషనల్​ ఐకాన్'గా​ నియమిస్తున్న విషయం తెలిసిందే. 2019 లోక్​సభ ఎన్నికల సందర్భంగా ఎమ్​ఎస్​ ధోనీ, ఆమిర్​ ఖాన్​, మేరీ కోమ్ లను, 2022లో పంకజ్ త్రిపాఠీని ఎన్నికల సంఘం నేషనల్​ ఐకాన్​గా నియమించింది. ప్రజలు ఓటింగ్​ పక్రియలో పాల్గొనేలా వీరి ద్వారా అవగాహన కల్పిస్తూ ఉంటుంది.