మంత్రి కేటీఆర్‌కు ఈసీ నోటీసులు .. 3 గంటల్లోపు వివరణ ఇవ్వాలె

మంత్రి కేటీఆర్‌కు ఈసీ నోటీసులు .. 3 గంటల్లోపు వివరణ ఇవ్వాలె
  • ఆదివారం 3 గంటల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఇటీవల టీ-హబ్‌లో నిరుద్యోగులతో కేటీఆర్ జరిపిన సమావేశంపై ఈసీ సీరియస్ అయింది. కాంగ్రెస్‌ ఎంపీ రణదీప్‌ సుర్జేవాలా ఫిర్యాదు ఆధారంగా నోటీసులు ఇచ్చింది. రాజకీయ కార్యకలాపాలకు, ప్రచారానికి ప్రభుత్వ ఆఫీసును వాడుకున్నారని ఫిర్యాదు రావడంతో ఈసీ స్పందించింది. మంత్రి కేటీఆర్‌ ప్రాథమిక ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టు అభిప్రాయపడింది.

ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 3 గంటలలోపు నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. వివరణ ఇవ్వకపోతే.. మరో అవకాశం ఇవ్వకుండానే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. కేటీఆర్​అభ్యర్థి మాత్రమే కాదని, స్టార్​క్యాంపెయినర్ కూడా అని పేర్కొంది. కాగా​ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల మంత్రి కేటీఆర్ నిరుద్యోగ యువతతో టీ-హబ్‌‌లో భేటీ అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.