2020-21లో 11 శాతం జీడీపీ

2020-21లో 11 శాతం జీడీపీ

గత 3 నెలల్లో జీఎస్టీ వసూళ్లు నెలకు రూ. లక్ష కోట్లు దాటాయన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.  బడ్జెట్ లో భాగంగా.. ఆర్థిక సర్వేను లోక్ సభలో ప్రేవేశపెట్టారు. 2021-22 సంవత్సరానికి ఆర్థిక వృద్ధిరేటు 7.7శాతం  అంచనా వేశారు. మే 20లోగా ప్రైవేట్ రైళ్ల బిడ్డింగ్ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. 2023-24లో  ప్రైవేట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయన్నారు. త్వరలో విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశమన్నట్లు తెలిపారు. కోవిడ్ కు ముందు ఉన్న పరిస్థితులు వస్తాయని సర్వేలో తేలింది.  వ్యవసాయ రంగం సంక్షోభంలో కొనసాగుతోందన్నారు. గ్లోబల్ ఎకానమీ 4.4శాతం తగ్గే అవకాశం ఉందన్నారు. ఆహార ద్రవ్యోల్బణం 6.7శాతం నుంచి 9.1కి పెరిగిందన్నారు. 2021-22లో దేశ జీడీపీ వృద్ధిరేటు 10-12 శాతం అంచనా  వేశారు.  ఫార్మా,ఆభరణాలు, టెక్స్ టైల్ ఎగుమతుల్లో వృద్ధితో కరెంట్ ఖాతా 17 ఏళ్ల తర్వాత  మిగులు స్థాయికి చేరిందని తెలిపారు. అటు ఆర్థిక సర్వేతో స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయాయి. సెన్సెక్స్ 600పాయింట్లు,180 పాయింట్లకు పైగా నిఫ్టీ పడిపోయింది.

see more news

మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

సింఘూ బార్డర్ లో తీవ్ర ఉద్రిక్తత