ఢిల్లీ లిక్కర్ స్కాంలో కొనసాగుతున్న ఈడీ విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కొనసాగుతున్న ఈడీ విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ లింకులపై మరోసారి ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇవాళ ముగ్గురిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. వెన్నమనేని శ్రీనివాస్ రావుతో పాటు సాలిగ్రామ్ టెక్నాలజీ ఎండీ, జోనా కన్సల్టెంట్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో రామచంద్ర పిళ్లైతో కలిసి పెద్దమొత్తంలో లావాదేవీలు జరిపినట్లు ఈడీ గుర్తించింది.

రెండు రోజుల క్రితం వెన్నమనేని శ్రీనివాసరావును ఈడీ అధికారులు 7 గంటల పాటు ప్రశ్నించారు. వెన్నమనేని కంపెనీ ద్వారానే ఢిల్లీకి విమాన టికెట్లు బుక్ చేసినట్లు గుర్తించారు. శ్రీనివాస రావు ఆరు కంపెనీలలో డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నట్లు ఈడీ విచారణలో తేలింది.