రూ.260 కోట్ల మెగా సైబర్ స్కామ్.. ఈడీ దర్యాప్తులో బయటపడ్డ క్రిప్టో హవాలా దందా!

రూ.260 కోట్ల మెగా సైబర్ స్కామ్.. ఈడీ దర్యాప్తులో బయటపడ్డ క్రిప్టో హవాలా దందా!

ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీలను అక్రమార్కులు తమ కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుంటున్నారనే ఆందోళనలు చాలా కాలం నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా మెగా గ్లోబల్ సైబర్ ఫ్రాడ్ కేసును చేధించే పనిలో ఈడీ నిమగ్నమైంది. ఇందులో భాగంగా దాదాపు 11 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు అధికారులు. ఢిల్లీ, నోయిడా, గురుగ్రాము, డెహ్రాడూన్ ప్రాంతాల్లో రూ.260 కోట్ల స్కామ్ కి సంబంధించిన రైడ్స్ చేపట్టింది. 

నేరగాళ్లు ప్రజల నుంచి డబ్బు కాజేయటానికి పోలీసు అధికారులమని, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల మంటూ బెదిరింపులకు పాల్పడి వారి నుంచి డబ్బు కాజేసినట్లు సీబీఐ, ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిపై రంగంలోకి దిగిన ఈడీ నిందితులు ఈ డబ్బును అక్రమంగా విదేశాలకు హవాలా రూపంలో క్రిప్టో కరెన్సీ రూపంలో తరలించటం ద్వారా మనీలాండరింగ్ జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించింది. 

ALSO READ : మీ దగ్గర రూపాయి కూడా లేదా డోంట్ వర్రీ.. ఈ విధంగా చేస్తే కోటి రూపాయలు ఈజీగా సంపాదిస్తారు..!

కొన్ని కేసుల్లో నేరగాళ్లు తాము మైక్రోసాఫ్ట్, అమెజాన్ టెక్ ప్రతినిధులమని సహాయం చేసేందుకు కాల్ చేసినట్లు నమ్మబలికి వారి నుంచి డబ్బు కాజేసినట్లు పోలీసులకు తెలిసింది. సైబర్ నేరగాళ్లు తాము చేపట్టిన నేరాల నుంచి వచ్చిన డబ్బును క్రిప్టోలుగా మార్చి అనేక వాలెట్లలోకి పంపినట్లు గుర్తించారు అధికారులు. బిట్ కాయిన్ల రూపంలో వాటిని స్టోర్ చేసి ఆ తర్వాత వాటిని క్రిప్టో కరెన్సీల్లో టెథర్ అనే స్టేబుల్ కాయిన్ గా మార్చారు. అక్కడి నుంచి హవాలా మార్గంలో యూఏఈలోని ఆపరేటర్ల ద్వారా క్యాష్ గా మార్చుకున్నట్లు దర్యాప్తులో తేలింది.