లిక్కర్ స్కాం : అభిషేక్, విజయ్ నాయర్ కస్టడీ పిటిషన్పై విచారణ

లిక్కర్ స్కాం : అభిషేక్, విజయ్ నాయర్ కస్టడీ పిటిషన్పై విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులుగా ఉన్న బోయినపల్లి అభిషేక్, విజయ్ నాయర్లను కస్టడీ పిటిషన్ పై సీబీఐ స్పెషల్ కోర్టు ఇవాళ విచారణ జరపనుంది. మనీలాండరింగ్ కేసులో వారిని ప్రశ్నించేందుకు కస్టడీకి అనుమతించాలంటూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరపనున్న న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. 

ఇదిలా ఉంటే అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ పై సాయంత్రం 4గంటలకు సీబీఐ స్పెషల్ కోర్టులో విచారణకు రానుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులైనందున వారికి బెయిల్ మంజూరు చేయొద్దని ఈడీ ఇప్పటికే కోర్టుకు విన్నవించింది. మరోవైపు లిక్కర్ స్కాం కేసులో అప్రూవర్ గా మారిన దినేష్ అరోరో వాంగ్మూలాన్ని సీబీఐ కోర్టు రికార్డు చేసింది. కెమెరా ప్రొసీడింగ్స్ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేయనుంది. అప్రూవర్ గా మారడంతో లిక్కర్ కేసులో దినేష్ అరోరాను సాక్షిగా పరిగణించాలంటూ సీబీఐ నవంబర్ 9న కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, సమీర్ మహేంద్రును ఈడీ అరెస్ట్ చేసింది.