బైజూస్ రవీంద్రన్కు ఈడీ లుక్ అవుట్ నోటీసులు

బైజూస్ రవీంద్రన్కు ఈడీ లుక్ అవుట్ నోటీసులు

విద్యావేత్త  బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. దేశం విడిచి వెళ్లొద్దని నోటీసులో పేర్కొంది. ఎడ్ టెక్ సంస్థపై విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా)పై ఏజెన్సీ విచారణలో భాగంగా ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. 
ప్రస్తుతం రవీంద్రన్ విదేశాల్లో ఉన్నప్పటికీ LOC  జారీ అయ్యాయి కాబట్టి .. తిరిగి అతను ఇండియా వచ్చిన తర్వాత దేశం విడిచి వెళ్లకూడదని తెలిపింది. 

ఇదిలా ఉంటే.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న edtech దిగ్గజం బైజూస్ కనీసం ఆఫీసుల రెంట్ చెల్లించలేని పరిస్థితిలో ఉంది. అద్దె బకాయి చెల్లించేందుకు డిపాజిట్ లను ఉపయోగించాల్సిన దుస్థితి. మూడేళ్ల క్రితం బెంగళూరులోని ప్రెస్టీజ్ గ్రూప్ తో ఆఫీస్ స్థలంకోసం లీజుకు ఒప్పందం కుదుర్చుకుంది బైజూస్.. నెలకు దాదాపు రూ.4 కోట్ల రెంట్ చెల్లిస్తోంది.

దీంతోపాటు కళ్యానీ టెక్ పార్కులో ఆఫీసు కోసం కళ్యాణీ డెవలపర్స్ తో5లక్షల చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకుంది. అయితే అద్దె చెల్లించడంలో బైజూస్ విఫలమైందని కల్యాణి డెవలపర్స్ నోటీసులు జారీ చేసింది.