అరవింద్ కేజ్రీవాల్ కు తొమ్మిదోసారి ఈడీ నోటీసులు

 అరవింద్ కేజ్రీవాల్ కు తొమ్మిదోసారి ఈడీ నోటీసులు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరో కేసు నమోదు చేసింది. శనివారం  ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ రౌన్ ఎవెన్యూ కోర్టు అరవింద్ కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ అనంతరం కేజ్రీవాల్ పై ఈడీ కొత్త కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఈ కేసుపై మీడియా సమావేశం నిర్వహించిన ఆప్ నేతలు... లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు తొమ్మిదోసారి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.  

కాగా,  ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు హాజరుకావాలని ఇప్పటికే ఎనిమిదిసార్లు కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే,  కేజ్రీవాల్ విచారణకు హాజరుకాకపోవడంతో రౌస్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించింది ఈడీ. దీంతో మార్చి 16న తమ ఎదుట హాజరు కావాలని  న్యాయమూర్తి కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేశారు. దీనిపై స్టే ఇవ్వాలన్న సీఎం పిటిషన్ ను సెషన్స్ కోర్టు తిరస్కరించడంతో శనివారం కోర్టు ఎదుట హాజరయ్యారు కేజ్రీవాల్.  లిక్కర్ కేసులో 15 వేల బాండ్, రూ.లక్ష పూచికత్తుతో  కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది.