
హైదరాబాద్: బ్యాంకుల నుంచి వందల కోట్లు రుణాలు తీసుకుని ఎగవేసిన కేసులో ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీ ఆఫీసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. డీ మ్యాట్ అకౌంట్ల నుంచి షేర్లు బదలాయించుకుని రూ.350 కోట్లు బ్యాంకుల నుంచి రుణం తీసుకుంది కార్వీ యాజమాన్యం. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను వ్యక్తిగత ఖాతాలకు బదలాయించుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను ఈడీ కార్యాలయానికి తరలించారు. కాగా, మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు కార్వీపై అభియోగాలున్నాయి. నిధుల గోల్ మాల్, కస్టమర్ల నగదు స్వాహా చేసినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. పీటీ వారెంట్ మీద నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్‌లోని కార్వీ ఆఫీసులు, పార్థసారథి, రాజీవ్ రంజన్, కృష్ణ ఇళ్లలో ఈడీ సోదాలు చేసింది.