ఇండియా నుంచి చైనా కంపెనీలకు వివో పంపింది రూ.లక్ష కోట్లు పైనే

ఇండియా నుంచి చైనా కంపెనీలకు  వివో పంపింది రూ.లక్ష కోట్లు పైనే
  • మనీ లాండరింగ్ కేసులో తాజాగా అరెస్ట్ అయిన కంపెనీ ఎగ్జిక్యూటివ్‌‌‌‌
  • 2014-15 నుంచి 2019-20 మధ్య కంపెనీ ట్యాక్స్‌‌‌‌లు కట్టలేదన్న ఈడీ
  • వీసా రూల్స్‌‌‌‌ ఉల్లంఘించిన వివో ఉద్యోగులు

న్యూఢిల్లీ: చైనీస్ స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌ కంపెనీ వివో  2014–15 నుంచి 2019–20 మధ్య ఇండియా నుంచి ఏకంగా రూ.1.07 లక్ష కోట్లను చైనీస్ కంపెనీలకు పంపిందని ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేర్కొంది. ఇండియాకు వెలుపల ఉన్న కంపెనీలకు రాయల్టీ వంటి ఛార్జీల కింద వివో డబ్బులు పంపిందని వెల్లడించింది. దేశంలో ట్యాక్స్‌‌‌‌లు చెల్లించ లేదని, ముఖ్యంగా వివో పేరెంట్ కంపెనీ కంట్రోల్ చేస్తున్న కొన్ని చైనీస్ ట్రేడింగ్ కంపెనీలకు భారీగా ఫండ్స్ పంపిందని వివరించింది. 

‘2014–15 నుంచి 2019–20 మధ్య వివో ఇండియా  తమ స్టాట్యుటరీ ఫైలింగ్స్‌‌‌‌లో ఎటువంటి ప్రాఫిట్స్ చూపించలేదు. అందువలన ఎటువంటి ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ ట్యాక్స్ చెల్లించలేదు. ఇండియా నుంచి విదేశాలకు భారీగా ఫండ్స్ పంపింది’ అని ఈడీ  ఈ వారం కోర్టు ఫైలింగ్‌‌‌‌లో వివరించింది. విదేశాలకు ముఖ్యంగా చైనీస్ కంపెనీలకు రూ.62,470 కోట్లను  రాయల్టీలు, ఇతర రెమిటెన్స్‌‌‌‌ల కింద వివో పంపిందని కిందటేడాది జులైలో ఈడీ అంచనా వేసింది. తాజాగా ఈ నెంబర్ రూ. లక్ష కోట్లను దాటిందని కోర్టు ఫైలింగ్‌‌‌‌లో వివరించింది. వివోకి చెందిన 48 సైట్లలో  కిందటేడాది ఈడీ దాడులు జరిపింది. మనీలాండరింగ్‌‌‌‌కు పాల్పడుతోందనే అనుమానంతో సోదాలు నిర్వహించింది. దేశంలో ట్యాక్స్‌‌‌‌లు ఎగ్గొట్టేందుకు ఇన్‌‌‌‌డైరెక్ట్‌‌‌‌గా తనకు కంట్రోల్‌‌‌‌ ఉన్న  కంపెనీలకు భారీగా డబ్బులు పంపిందని ఈడీ ఆరోపించింది.

జమ్మూ, కాశ్మీర్‌‌లోని సెన్సిటివ్ ఏరియాలకు.. 

కనీసం 30 మంది చైనీస్‌‌‌‌  ఇండివిడ్యువల్స్ బిజినెస్ వీసా పైన ఇండియాలోకి ఎంటర్ అయ్యారని, కానీ, వీరు తమ ఎంప్లాయర్ (పనిచేసే కంపెనీ) వివో అని బయటపెట్టలేదని 32 పేజీల కోర్టు ఫైలింగ్‌‌‌‌లో  ఈడీ పేర్కొంది. ఈ ఉద్యోగులు వీసా రూల్స్‌‌‌‌ను ఉల్లంఘించడమే కాకుండా  జమ్మూ, కాశ్మీర్‌‌‌‌, లడక్‌‌‌‌‌‌‌‌లోని సెన్సిటివ్ ప్రాంతాలయిన హిమాలయన్ రీజియన్‌‌‌‌లో  తిరిగారని వెల్లడించింది. ఇండియన్ గవర్నమెంట్‌‌‌‌ వందల కొద్దీ చైనీస్ యాప్‌‌‌‌లను ఇండియాలో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా చైనా నుంచి వచ్చే ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లపై నియంత్రణలు కూడా పెట్టింది. ఇలాంటి టైమ్‌‌‌‌లో ఈ కోర్టు స్టేట్‌‌‌‌మెంట్ రావడం గమనించాలి. ‘చాలా మంది చైనా ఇండివిడ్యువల్స్‌‌‌‌  జమ్మూ, కాశ్మీర్‌‌‌‌‌‌‌‌, లడక్‌‌‌‌లోని సెన్సిటివ్ ప్లేస్‌‌‌‌లతో సహా ఇండియా మొత్తం తిరిగారు. ఇండియన్ వీసా కండిషన్స్‌‌‌‌ను ఉల్లంఘించారు’ అని ఈడీ వివరించింది. 

కాగా, లడక్‌‌‌‌, జమ్మూ, కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లోని కొన్ని సెన్సిటివ్ ఏరియాల్లో ఫారినర్లు ప్రవేశించడాన్ని, ఉండడాన్ని ప్రభుత్వం నిషేధించింది. ఈ ప్లేస్‌‌‌‌లలో ఉండాలంటే అధికారుల నుంచి సపరేట్‌‌‌‌గా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది.  చాలా మంది వివో ఉద్యోగులు సరియైన వీసా లేకుండా ఇండియాలో పనిచేస్తున్నారని ఈడీ పేర్కొంది. తమ వీసా అప్లికేషన్‌‌‌‌లో  ఎంప్లాయర్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన వివరాలను దాచి పెట్టారని తెలిపింది. మనీ లాండరింగ్ కేసులో వివో ఎగ్జిక్యూటివ్‌‌‌‌ గుంగ్వెన్‌‌‌‌ కుంగ్‌‌‌‌ను ఈ వారం  ఈడీ  అరెస్ట్ చేసింది. ఎగ్జిక్యూటివ్ అరెస్ట్ కావడంపై వివో ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయ పరమైన రూల్స్‌‌‌‌ను ఫాలో అవుతామని తెలిపింది. వివో కేసును జాగ్రత్తగా గమనిస్తున్నామని చైనా ఫారిన్ మినిస్ట్రీ ఈ వారం ప్రకటించింది. బీజింగ్‌‌‌‌లోని ఇండియన్ ఎంబసీ, దేశ ఫారిన్ మినిస్ట్రీ ఈ విషయంపై స్పందించలేదు. బార్డర్ ఇష్యూపై చైనా, ఇండియాకు మధ్య 2020లో జరిగిన గొడవలో 20 మంది ఇండియన్ సోల్జర్లు మరణించిన విషయం తెలిసిందే.