బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు

  బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో  ఈడీ సోదాలు ముగిశాయి. పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి మహిపాల్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, ఆఫీసులు,  ఇళ్లోనూ తనిఖీలు జరిగాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి మొత్తం మూడు చోట్ల రెయిడ్స్ కొనసాగాయి. ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధు ఇంట్లో  సోదాలు చేసింది ఈడీ. మహిపాల్ రెడ్డి వ్యాపార లావాదేవీలు, అకౌంట్స్, మనీ ట్రాన్సాక్షన్స్ పై ఆరా తీశారు అధికారులు. 

ఈడీ దాడులు ముగిసిన తర్వాత స్పదించారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఈడీ తనిఖీలు కొండని తవ్వి ఎలుకను తీసినట్లు ఉందని విమర్శించారు. సామాన్యుల కుటుంబంలో ఉన్న వస్తువులే..తమ ఇంట్లో ఉన్నాయన్నారు. తమ  ఇంట్లో ఈడీ విచారణ స్థాయి డబ్బులుగాని...విలువైన వస్తువులుగాని, బంగారంగాని  ఏమీ దొరకలేవన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలో భాగంగానే సీఎంల, మంత్రుల ఇండ్లు, ప్రముఖ రాజకీయ నేతల ఇండ్లలో ఈడీ దాడులు నిర్వహిస్తుందన్నారు. అలాగే తమ ఇంట్లో దాడులు జరిపారన్నారు మహిపాల్ రెడ్డి.