హేమంత్‌ సోరెన్‌కు మరోసారి ఈడీ సమన్లు

హేమంత్‌ సోరెన్‌కు మరోసారి ఈడీ సమన్లు

మైనింగ్‌ లీజులు, మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ ) జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ప్రశ్నించేందుకు రెండోసారి సమన్లు ​జారీ చేసింది. నవంబర్ 17న విచారణకు రావాలని ఆయన్ను కోరింది.  ఈడీ గతంలోనూ ఒకసారి సమన్లు పంపగా.. వాటిని హేమంత్ సోరెన్‌ దాటివేశారు. ఈడీ తనకు సమన్లు పంపడం ఒక ఆదివాసి ముఖ్యమంత్రిని వేధించే కుట్రలో భాగమేనని హేమంత్ సోరెన్‌ వ్యాఖ్యానించారు.  

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రతీకార చర్యలతో బిజీగా ఉంటూ పారిపోయిన వ్యాపారులను విడిచిపెట్టిందని ఆరోపించారు. ఈడీకి తాను భయపడనన్నారు.  ఇదే కేసులో సోరెన్‌ సన్నిహితుడు పంకజ్‌ మిశ్రాను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జులై నెలలో రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించిన ఈడీ ...  మిశ్రాకు చెందిన రూ.11.88 కోట్లు స్వాధీనం చేసుకుంది. అలాగే ఆయన ఇంట్లో లెక్కల్లోకి రాని రూ.5.34 కోట్లను గుర్తించింది.