ఈషా రెబ్బా కల ఇప్పటికి తీరుతోందా!

ఈషా రెబ్బా కల ఇప్పటికి తీరుతోందా!

అన్నీ ఉన్నా ఏదీ కలిసి రాదు కొందరికి. ఈషా రెబ్బాకి కూడా అంతే పాపం. ఆమెకి చక్కని అందం ఉంది. టాలెంట్ ఉంది. కానీ అదృష్టం మాత్రం ఆమెతో దోబూచులాడుతూ ఉంటుంది. అడపా దడపా అవకాశాలే తప్ప చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటీ పడలేదు తన ఖాతాల. పోయినేడు బ్రాండ్ బాబు, అ, అరవింద సమేత, సుబ్రహ్మణ్యపురం అంటూ చాలా సినిమాలే చేసింది. అయినా సరైన సక్సెస్ దక్కలేదు. ప్రస్తుతం తమిళ, కన్నడ భాషల్లో చెరో మూవీ చేస్తోంది. తెలుగులో ‘రాగల 24 గంటల్లో ’ చిత్రంలో నటిస్తోంది.

ఈ సినిమా తన కెరీర్‌ ని మలుపు తిప్పుతుందని కాన్ఫిడెంట్‌‌గా ఉంది ఈషా. దానికి కారణం… ఇది ఉమన్ సెంట్రిక్‌ మూవీ కావడం. ఈషాకి ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీలో లీడ్‌‌ రోల్ చేయాలన్నది ఎప్పటి నుంచో ఉన్న కల. అది ఈ సినిమాతో తీరుతోందంటూ చాలా సంబర పడుతోంది. ఇది ఓ సస్పె న్స్ థ్రిల్లర్‌ మూవీ. ఈ జానర్‌ సినిమాలకు ప్రస్తుతం డిమాండ్ బాగుంది. కాబట్టి వర్కవుటయ్యిందంటే ఈషా కెరీర్‌ టర్న్‌‌ అయ్యే అవకాశం ఉంది. అలాగే జరగాలని ఆశిద్దాం.