ఢిల్లీలో రైతుల నిరసనకు మద్దతుగా...కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

ఢిల్లీలో రైతుల నిరసనకు మద్దతుగా...కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

కోల్​బెల్ట్, వెలుగు: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతులపై పోలీసులు కాల్పులు జరపడాన్ని వ్యతిరేకిస్తూ భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్​టీయూ) ఆధ్వర్యంలో  కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గురువారం రామకృష్ణాపూర్​పట్టణం రాజీవ్ ​చౌక్​ చౌరస్తాలో లీడర్లు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఢిల్లీ సమీప ఖనౌరీ వద్ద శాంతియుతంగా ఆందోళన చేపట్టిన రైతులపై కాల్పులు జరిపి 23 ఏండ్ల శుభాకరన్​ అనే యువకుడిని కాల్చి చంపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.  రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. ఐఎఫ్​టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.బ్రహ్మానందం, రామకృష్ణాపూర్​టౌన్​ప్రెసిడెంట్​గజ్జి మల్లేశ్, ముత్యాల వెంకటేశ్, అప్పారావు, నాగరాజు, సత్యం, ఉమా తదితరులు పాల్గొన్నారు.