క్రీడలపై ఆసక్తి పెంచేందుకు కృషి ..అల్ఫోర్స్ చైర్మన్ వి.నరేందర్రెడ్డి

క్రీడలపై ఆసక్తి పెంచేందుకు కృషి  ..అల్ఫోర్స్ చైర్మన్ వి.నరేందర్రెడ్డి

కొత్తపల్లి, వెలుగు: విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి పెంపొందించేందుకు ప్రోత్సహిస్తున్నామని అల్ఫోర్స్​ చైర్మన్​ వి.నరేందర్​రెడ్డి అన్నారు. కొత్తపల్లి అల్ఫోర్స్ ఇ -టెక్నో స్కూల్‌‌‌‌లో మండల ఎస్​జీఎఫ్ కార్యదర్శి గన్నె లక్ష్మణ్ ఆధ్వర్యంలో అల్ఫోర్స్​ స్పోర్ట్స్‌‌‌‌ టీ షర్ట్‌‌‌‌లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వారికి ఇష్టమైన ఆటను ఎంచుకొని అందులో నైపుణ్యం సాధించాలన్నారు. తద్వారా జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవచ్చన్నారు. అల్ఫోర్స్ విద్యాసంస్థలు క్రీడాకారులకు చేయూతనిచ్చేందుకు సిద్ధంగా ఉంటాయన్నారు.