Health Tips: కోడి గుడ్డుతోనే కాదు.. దాని పెంకుతో కూడా బోలెడు లాభాలు..

Health Tips:  కోడి గుడ్డుతోనే కాదు.. దాని పెంకుతో కూడా బోలెడు లాభాలు..

ఈజీ అండ్ టేస్టీ వంటకం అనగానే అందరికీ గుర్తొచ్చేది కోడిగుడ్డు. అయితే, కుకింగ్ వరకు ఓకే కానీ, ఆ తర్వాత వాటి పెంకుల్ని ఏం చేస్తున్నారు. ఇందులో అడగాల్సింది. ఏముంది. పడేస్తాం అంటారా. అయితే ఇకనుంచి కోడిగుడ్డు పెంకుల్ని దాచిపెట్టండి. దానివల్ల బోలెడు లాభాలున్నాయి.. 

• కొన్ని రోజులకు కత్తెర పదునంతా పోతుంది. అప్పుడు కోడి గుడ్డు పెంకులు రెండుమూడు తీసుకుని.. ఆ కత్తెరతో వాటిని చిన్నచిన్న ముక్కలు చేయాలి. దానివల్ల కత్తెర షార్ప్ అవుతుంది. అరిగిన మిక్సీ జార్ బ్లేడ్స్ ని పదును చేయడానికి కోడి గుడ్డు పెంకుల్ని వాడొచ్చు. గుడ్డు పెంకుల్ని మిక్సీ జార్ లో వేసి పొడి చేస్తే బ్లేడ్స్ షార్ప్ అవుతాయి. అలాగే ఆ గుడ్డు పౌడర్ ని చెట్ల కుదుళ్లలో వేస్తే మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. 

* ఇంట్లోకి బొద్దింకలు, చీమలు, బల్లులు రాకూడదంటే.. గుడ్డు పెంకుల పొడిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి అవి తిరిగే చోట వేయాలి.