పక్కా ప్లాన్​తో ఏకలవ్య జాబ్స్​

పక్కా ప్లాన్​తో ఏకలవ్య జాబ్స్​

పీజీతోపాటు బీఎడ్​ చేసిన అభ్యర్థులకు ఏకలవ్య టీచింగ్​ స్టాఫ్​ నోటిఫికేషన్​ ఈ కోవిడ్​ టైంలో మంచి అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో 379 పోస్టులు ఉన్నాయి. జూన్​ ఫస్ట్​ వీక్​లో జరిగే ఎగ్జామ్​కు ప్లాన్​ ప్రకారం ప్రిపరేషన్​ సాగిస్తే.. ఈజీగా జాబ్​​​ కొట్టొచ్చు. ఎగ్జామ్​ ప్యాటర్న్​ , ప్రిపరేషన్​ ప్లాన్​పై సబ్జెక్ట్​ ఎక్స్​పర్ట్​ గైడెన్స్​ ఈ వారం.

సెంట్రల్​ ట్రైబల్​ వెల్ఫేర్​ డిపార్ట్​మెంట్​ దేశవ్యాప్తంగా ఏకలవ్య రెసిడిన్షియల్​ స్కూళ్లలో 3400 బోధన సిబ్బంది ఖాళీల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్​ ఇచ్చింది. దరఖాస్తు గడువు ఏప్రిల్​ 30తో ముగియనుండగా.. జూన్​ ఫస్ట్​ వీక్​లో ఎగ్జామ్​ ఉంటుంది. తెలంగాణలో 11 ప్రిన్సిపల్​, 6 వైస్​ ప్రిన్సిపల్​, 77 పీజీటీ, 168 టీజీటీ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉంది. ఎగ్జామ్​ ప్యాటర్న్​ ప్రకారం సబ్జెక్ట్​ వైజ్​గా కాన్సెప్ట్​లను చదువుకుంటే జాబ్​ కొట్టడం ఈజీ అవుతుంది.

సిలబస్ ​& స్టడీ ప్లాన్​
జనరల్​ ఇంగ్లిష్​: సెకండరీ స్థాయిలో అభ్యర్థి జనరల్​ ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి.  ఆర్టికల్స్​, ప్రిపోజిషన్స్, టెన్స్​, వాయిస్​, స్పీచెస్​, సెంటెన్స్​, డిగ్రీ ఆఫ్​ కంపోజిషన్, సింపుల్​, కాంపౌండ్​, కాంప్లెక్స్​ టాపిక్స్​ చూసుకోవాలి. సీబీఎస్​ఈ ఇంగ్లిష్​​ గ్రామర్​ బుక్, ​ Wrin & martin  గ్రామర్​ బుక్​ రెఫర్​ చేస్తే  సరిపోతుంది.
జనరల్​ హిందీ:  హిందీ భాషలోని వాక్య నిర్మాణం పదజాలం, అర్థాలు, పర్యాయపదాలు, కవులు, ప్రత్యక్ష, పరోక్ష వాక్యాల నుంచి ప్రశ్నలు వచ్చే చాన్స్​ ఉంది. జనరల్​ హిందీ 10 మార్కులు స్కోర్​ చేయాలంటే సీబీఎస్​ఈ సెకండరీ స్థాయి వరకు ఉన్న హిందీ టెక్స్ట్​ బుక్స్​ చదివితే సరిపోతుంది.
లాజికల్​ రీజనింగ్​/ఎనలిటికల్​ ఎబిలిటీ:  ఇందులో రిటర్నింగ్​ అంశాలకు ప్రాముఖ్యత ఇస్తారు, నెంబర్​ సిరీస్​, లెటర్​ సిరీస్​, పోలిక పరీక్షలు, భిన్న పరీక్షలు, కోడింగ్–డికోడింగ్​, డైరెక్షన్​, మిస్సింగ్​ వర్డ్స్​,  డైస్​, భజన్​ టెస్ట్​, వెన్​చిత్రాలు, సీటింగ్​ అరేంజ్​మెంట్స్​, నిశ్చితార్థ వాక్యాలు, హేతువు, ప్రవచనాలు టాపిక్స్​ స్టడీ చేయాలి. ఇందు కోసం ఆర్​ఎస్​ అగర్వాల్​ రీజనింగ్​ బుక్​ రెఫర్​ చేయొచ్చు.
కంప్యూటర్​ లిటరసీ: కంప్యూటర్​ తరాలు, చరిత్ర, సోషల్​ మీడియా, ఇంటర్నెట్​, ఈమెయిల్​, కంప్యూటర్​ వైరస్​, డివైజెస్​ పరికరాలు చూసుకోవాలి. 
క్వాంటిటేటివ్​ ఆప్టిట్యూడ్​:  నెంబర్​ సిస్టం, సింప్లిఫికేషన్, నిష్పత్తి అనుపాతం, శాతాలు, లాభనష్టాలు, భాగస్వామ్యం, సరాసరి, వయసులు, బారువడ్డీ–చక్రవడ్డీ టాపిక్స్​ చదవాలి. ఆర్​ఎస్​ అగర్వాల్​ అర్థమెటిక్​ బుక్​ రెఫర్​ చేయొచ్చు. 

అకడమిక్​: అకడమిక్​ టాపిక్స్​ ప్రిన్సిపల్​, వైస్​ ప్రిన్సిపల్​ ఎగ్జామ్స్​కు మాత్రమే ఉంటాయి. ఇందులో చైల్డ్​ డెవలప్​మెంట్​, పెడగాగి అంశాలు, ఆర్టీఈ 2009, ఎన్​ఈపీ 2020, బాలల హక్కులు, పోస్కో చట్టం, బోధన అభ్యసన ప్రక్రియలోని టాపిక్స్, స్కూల్​ మేనేజ్​మెంట్​, ప్రిన్సిపల్​ విధులు, రికార్డులు, రిజిస్టర్లు, లైబ్రరీ, క్లబ్​లు, తదితర టాపిక్స్​ చదవాలి. బీఎడ్​లోని సైకాలజీ, స్కూల్​మేనేజ్​మెంట్​, ఫౌండేషన్​ ఆఫ్​​ ఎడ్యుకేషన్​ తెలుగు అకాడమీ బుక్స్​, ఇగ్నో బీఎడ్​ బుక్స్​ రెఫర్​ చేయాలి.

అడ్మినిస్ట్రేషన్​ & ఫైనాన్స్​: ఇందులో ప్రధానంగా సర్వీస్​ రూల్స్​ గురించి ఉంటాయి.ఇందుకోసం ఎన్​సీఈఆర్​టీ, ఎన్​సీటీఈ ప్రింట్​ చేసిన ఫండమెంటల్​ రూల్స్​ బుక్​తోపాటు టీచర్స్​ యూనియన్​ కరదీపికలో వచ్చే సర్వీస్​ రూల్స్​ స్టడీ చేస్తే సరిపోతుంది.
టీచింగ్​ ఆప్టిట్యూడ్​/పెడగాజి: పీజీటీ, టీజీటీ పోస్టులకు టీచింగ్​ ఆప్టిట్యూడ్​/పెడగాజి ఉంటుంది. ఇందులో కరిక్యులం, ప్రణాళికలు, పాఠ్యప్రణాళిక, వార్షిక ప్రణాళిక, మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు–విద్య, బోధనాధ్యయన శాస్త్రం, తదితర టాపిక్స్​ చూసుకోవాలి. బీఎడ్​లో బోధనా శాస్త్రం తెలుగు అకాడమీ బుక్​, ఇగ్నో బీఎడ్​​ బుక్స్​ చదవాలి. 

సంబంధిత సబ్జెక్ట్​: పీజీటీ అభ్యర్థులైతే వారి సబ్జెక్టు ప్రకారం సీబీఎస్​ఈ బుక్స్​ 12వ తరగతి వరకు, టీజీటీ అభ్యర్థులైతే సీబీఎస్​ఈ టెన్త్​ వరకు అన్ని టాపిక్స్​ అధ్యయనం చేయాలి.​   నెగెటివ్​ మార్క్స్​ ఉన్నందున జాగ్రత్తగా ప్రిపేరవ్వాలి. 

జనరల్​ నాలెడ్జ్​ & కరెంట్​ ఎఫైర్స్​
జనరల్​ నాలెడ్జ్​లో జాతీయ, అంతర్జాతీయ అంశాలు, సదస్సులు, సమావేశాలు, సంస్థలు, వ్యక్తులు, క్రీడలు, అవార్డులు, కొవిడ్​ 19, వ్యాక్సిన్లు తదితర టాపిక్స్​ అధ్యయనం చేస్తూ.. 2021 కరెంట్​ టాపిక్స్​​స్టడీ చేయాలి. ఇందుకోసం మేఘన, మనోరమ లాంటి ఇయర్​ బుక్స్​తోపాటు న్యూస్​పేపర్స్​ చదవాలి.

ఎగ్జామ్​ ప్యాటర్న్​: ప్రిన్సిపల్​, వైస్​ ప్రిన్సిపల్, పీజీటీ​ పోస్టులకు  సంబంధించి160 మార్కులకు రిటెన్​ ఎగ్జామ్, 40 మార్కులకు ఇంటర్వ్యూ కండక్ట్​ చేస్తారు. టీజీటీ  ఎగ్జామ్​ మాత్రం 180 మార్కులకు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి వన్​ ఫోర్త్​ మార్క్​ కట్​ చేస్తారు. అభ్యర్థి ఎగ్జామ్​ మెరిట్​, ఇంటర్వ్యూ ప్రతిభా ఓవరాల్​గా ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది.