దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాది తర్వాత..హైదరాబాద్ స్టేట్ కు విముక్తి లభించిందని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే అన్నారు. ఇవాళ నిజాం క్రూర పాలన నుంచి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందిన రోజన్నారు. సర్దార్ పటేల్ చొరవతోనే విముక్తి వచ్చిందన్నారు. ఏటా శంభాజీనగర్ లో మరఠ్వాడ ముక్తి సంగ్రామ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. విమోచనం కోసం ప్రాణాలర్పించిన వారికి ఏక్ నాథ్ షిండే నివాళులు అర్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన విమోచన వేడుకల్లో ఏక్ నాథ్ షిండే మాట్లాడారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకులకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి అమిత్ షా నివాళులు అర్పించారు.
