ఎమ్మీ అవార్డు అందుకున్న ఏక్తా కపూర్..తొలి భారతీయురాలిగా గుర్తింపు

ఎమ్మీ అవార్డు అందుకున్న ఏక్తా కపూర్..తొలి భారతీయురాలిగా గుర్తింపు

ఫేమస్ బాలీవుడ్ దర్శక నిర్మాత ఏక్తా కపూర్ (Ektaa Kapoor) కి ఆర్ట్స్ అండ్ టీవీ ఇండస్ట్రీలో చేసిన కృషికి గాను అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్లో 2023 నవంబర్ 20న 51వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్థుల(International Emmy Awards) వేడుకలో ఇంటర్నేషనల్ ఎమ్మీ డైరెక్టరేట్(International Emmys Directorate Award) అవార్డు వరించింది.

ఈ అవార్డు అందుకున్న మొదటి భారతీయ మహిళా దర్శకురాలు ఏక్తా కపూర్ కావడం విశేషం. ఎమ్మీ అవార్డును ఫేమస్ రైటర్ దీపక్ చోప్రా చేతుల మీదుగా అవార్డు అందుకుంటూ..'ఈ గర్వించదగ్గ ఎమ్మీ అవార్డు ఇండియా కోసం అంటూ..'ఎమోషనల్ అయింది. అంతే కాకుండా..ఏక్తా తనకు ఈ గుర్తింపు దక్కడంపై ఆనందం వ్యక్తం చేస్తూ..‘నా హృదయంలో ఈ అవార్డుకు ప్రత్యేక స్థానముంది.ఈ గుర్తింపు నాకు మరింత ఉత్సాహన్నిస్తుంది. పర్సనల్ అండ్ వర్క్ లైఫ్‌లో ఇదెంతో కీలకమైన అంశం. ఈ వేదికపై నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంతోపాటు గౌరవంగా ఉందని తెలిపారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by EktaaRkapoor (@ektarkapoor)

ఏక్తా కపూర్ టెలివిజన్ పరిశ్రమలో.. మార్కెట్ లీడర్‌షిప్‌తో పాటు భారతదేశపు అగ్రశ్రేణి ఎంటర్‌టైన్‌మెంట్లో షోస్ నిర్మిస్తున్నారు. OTT ప్లాట్‌ఫారమ్‌తో ఇండియా వైడ్గా ఆడియన్స్ను సొంతం చేసుకున్నారు. 

టెలివిజన్ రంగంలో ఎంతో ఫేమస్ గల ఈ అవార్డును ఆస్కార్ అవార్డుతో పోలుస్తారు. ఇంతటి గొప్ప అవార్డును సాధించిన ఏక్తాకపూర్కి బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి విషెష్ అందుతున్నాయి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by EktaaRkapoor (@ektarkapoor)