గ్రేటర్ వరంగల్ పరిధిలో ఎన్నికల వాతావరణం

గ్రేటర్ వరంగల్ పరిధిలో ఎన్నికల వాతావరణం
  • గోడలకు పోస్టర్లు.. తలుపులకు స్టిక్కర్లు
  • టికెట్లు రాకముందే మొదలైన ప్రచారం
  • జంక్షన్లలో వాల్‍ పెయింటింగ్స్.. ఇంటింటికీ కరపత్రాలు
  • ఉదయం నుంచి సాయంత్రం వరకు జనంలోనే లీడర్లు

వరంగల్‍, వెలుగు: గ్రేటర్ వరంగల్ పరిధిలోని నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా ఎన్నికల వాతావరణమే కనపడుతోంది. ముందస్తు ఎన్నికలు వస్తాయని జోరుగా ప్రచారం సాగుతుండడంతో అధికార, విపక్ష పార్టీలు ప్రచారానికి పదును పెట్టాయి. పార్టీ నుంచి టికెట్ కన్ఫమ్ కాకపోయినా గోడలపై పోస్టర్లు, తలుపులకు డోర్‍ స్టిక్కర్లు వేసేస్తున్నారు. మెయిన్‍ జంక్షన్లలో వాల్ పెయింటింగ్స్ రాయిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అభివృద్ధి పనుల పేరుతో జనాల్లోకి వెళితే.. ప్రతిపక్ష లీడర్లు ఎమ్మెల్యేల వైఫల్యాలను జనంలో ఎండగడుతున్నారు.

ఎవరికివారే..

అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే లే దాదాపు పోటీలో ఉంటారని క్లారిటీ ఉన్నా.. కాం గ్రెస్, బీజేపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఎమ్మెల్యే టికెట్ కోసం ఇద్దరు, ముగ్గురు ప్రయత్నిస్తుండడంతో ఎవరికివారే ప్రచారం మొదలుపెట్టారు. బయటకు ఐక్యంగా ఉన్నామని సంకేతాలు ఇస్తున్నా  బరిలో నిలబడాలనే ఆశతోనే ముందస్తు ప్ర చారం షురూ చేశారు. ఇప్పటికే ప్రచార వాహ నాలు, సామగ్రి రెడీ చేసుకున్నారు. గతంలో లేని విధంగా ప్రజలకు దగ్గరవుతున్నారు. వాడవాడలా తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటున్నారు.

ఖర్చు నుంచి తప్పించే ఉపాయం..

ఎన్నికల సమయంలో ఈసీకి ఎన్నికల ఖర్చు లెక్కచెప్పాల్సి ఉంటుంది. అదేదో ఇప్పటి నుంచే ఖర్చు చేస్తే.. ఆలోపు ఖర్చు తక్కువగా చూపుకొనే అవకాశం ఉంటుందని, ఇప్పుడే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. పార్టీల లీడర్లు తమ ఫొటోలు, పార్టీ సింబల్‍ ఉండేలా వాల్‍ పెయింటింగ్స్ వేయిస్తున్నారు. కొన్నిచోట్ల నిమిషాల్లో గోడ మీద ముద్రపడేలా డిజిటల్ పెయింటింగ్స్ ఉపయోగిస్తున్నారు. ఎమ్మెల్యేల వైఫల్యాలు, తాము చేసే అభివృద్ధి గురించి వివరిస్తూ.. ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. డోర్ స్టిక్కర్ల ద్వారా ఆకట్టుకుంటున్నారు.ఇంటింటికి వీటిని పంపిస్తున్నారు.

మచ్చిక చేసుకుంటున్నరు..

నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా పార్టీ లీడర్లు, తమ మంది మార్బలంతో కనిపిస్తున్నారు. అధి కార బీఆర్‍ఎస్‍ పార్టీ ఎమ్మెల్యేలు అభివృద్ధి కార్యక్రమాలు, పనుల ప్రారంభోత్సవాలను అడ్డుపెట్టుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. కాలనీ, కుల పెద్దలను ఆప్యాయంగా పలకరిస్తు న్నారు. అపొజిషన్‍ బీజేపీ, కాంగ్రెస్‍ పార్టీల నాయకులు  ముందస్తు ప్రచారం స్టార్ట్ చేశారు. డివిజన్ల వారిగా గడపగడపకూ వెళ్తున్నారు. పనిలో పనిగా చేతిలో కరపత్రం పెట్టి ఓటర్ల తలుపులకు పార్టీ స్టిక్కర్లు అంటిస్తున్నారు. మార్నింగ్ వాక్​పేరుతో యువతను మచ్చిక చేసుకుంటున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ప్రచార జోరు కొనసాగిస్తున్నారు.