క్యాష్ ఫ్లో కట్టడిపై ఈసీ ఫోకస్

క్యాష్ ఫ్లో కట్టడిపై ఈసీ ఫోకస్

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల సమయంలో ధన ప్రవాహం కట్టడిపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. ఈసారి మరిన్ని ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ ఏజెన్సీలను రంగంలోకి దించాలని నిర్ణయించింది. ఇటీవల రాష్ట్ర పర్యటనలో ఈసీ బృందం గత ఎన్నికల్లో రాష్ట్రంలో స్వాధీనం చేసుకున్న నగదు, గత 4 ఉప ఎన్నికల్లో జరిగిన ఖర్చు అంచనాలపై చర్చించింది. 

ఈ ఖర్చులను చూసి అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలే రాష్ట్రంలో జరిగిన మునుగోడు, హుజూరాబాద్​ ఉప ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్లు ఖర్చు చేశాయని అంచనా. గత అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుబడిన నగదు, మద్యం విలువ రూ.97 కోట్లు ఉంటుందని పేర్కొంది. దీంతో నగదు ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు 20కి పైగా ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది.