నోట్ల ఎన్నికలు : రూ.4 వేల 650 కోట్ల విలువైన సొత్తు ఈసీ స్వాధీనం

నోట్ల ఎన్నికలు : రూ.4 వేల 650 కోట్ల విలువైన సొత్తు ఈసీ స్వాధీనం

ఎన్నికలు అంటే డబ్బు అనేది అందికీ తెలిసినా.. డబ్బులే ఎన్నికలుగా మారిపోయాయి.. భారత దేశ చరిత్రలోనే 2024 ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా ఈసీ లెక్కలు చెబుతున్నాయి.. దేశంలో ఇప్పటి వరకు ఫస్ట్ ఫేస్ పోలింగ్ ప్రారంభమే కాలేదు.. అప్పుడే అక్షరాల 4 వేల 650 కోట్ల రూపాయల విలువైన సొత్తును స్వాదీనం చేసుకున్నది ఎన్నికల సంఘం.

 అవును.. ఇది నిజం.. ఎన్నికల సంఘం అధికారులకే షాకింగ్ గా ఉంది.. ఎందుకంటే.. 2019 ఎన్నికల్లో మొత్తం స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ 3 వేల 500 కోట్లుగానే ఉంది.. 2024లో మాత్రం ఇంకా పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకముందే 4 వేల 650 కోట్ల విలువైన సొత్తు.. లెక్కాపత్రాలు లేకుండా దొరకటం అనేది దేశ రాజకీయాలను షాకింగ్ కు గురి చేస్తున్నాయి.

2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసే సరికి..

నగదు : రూ. 8 వందల 44 కోట్లు క్యాష్ పట్టుబడింది
లిక్కర్ : రూ. 3 వందల 4 కోట్ల 6  లక్షల విలువ గల మద్యపానం సీజ్ అయ్యింది
డ్రగ్స్ : రూ. ఒక వెయ్యి 2 వందల 79 కోట్ల విలువగల మాదక ద్రవ్యాలు సీజ్ అయ్యాయి. 
ఖరీదైన మెటల్ :  రూ. 9 వందల 87 కోట్ల విలువగల మెటల్ పట్టుబడింది.
 ఉచితంగా ఇచ్చే వస్తువులు : రూ. 60 కోట్ల 15 లక్షల ఉచితంగా ఇచ్చే వస్తువులు పట్టుబడ్డాయి. 

 2024 సార్వత్రిక ఎన్నికలు మార్చి 1 నుంచి ఏప్రిల్ 13 2024 వరకు లభ్యమైన డేటా

నగదు : రూ. 3 వందల 95 కోట్ల 39 లక్షల క్యాష్ పట్టుబడింది
లిక్కర్ : రూ. 4 వందల 89  కోట్ల 3  లక్షల విలువ గల మద్యపానం సీజ్ అయ్యింది
డ్రగ్స్ : రూ. 2 వేల 68 కోట్ల 8 లక్షల విలువగల మాదక ద్రవ్యాలు సీజ్ అయ్యాయి. 
ఖరీదైన మెటల్ :  రూ. 5 వందల 62 కోట్ల విలువగల మెటల్ పట్టుబడింది.
 ఉచితంగా ఇచ్చే వస్తువులు : రూ. 1 వెయ్యి 1 వంద 42 కోట్ల 49 లక్షల ఉచితంగా ఇచ్చే వస్తువులు పట్టుబడ్డాయి.  

  2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకముందే 4 వేల 650 కోట్ల విలువైన సొత్తు.. లెక్కాపత్రాలు లేకుండా దొరకటం అనేది దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.