చింతన్ శిబిర్తో కాంగ్రెస్లో ఎలాంటి మార్పు రాదు

చింతన్ శిబిర్తో కాంగ్రెస్లో ఎలాంటి మార్పు రాదు

మళ్లీ ఎన్నికల్లో ఓడే వరకు ఇదే పరిస్థితి అంటూ పీకే విమర్శలు

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయే వరకు కాంగ్రెస్ ఇలానే ఉంటుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగిన చింతన్ శిబిర్ పై తన అభిప్రాయం చెప్పాలని కొందరు పదే పదే అడిగినట్లు ట్వీట్ చేశారు. చింతన్ శిబిర్ ద్వారా కాంగ్రెస్ లో ఎలాంటి మార్పులు జరగవన్నారు. యథాతథ స్థితే ఉంటుందంటూ విమర్శించారు. రాబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఓడే వరకు కాంగ్రెస్ లో ప్రస్తుత పరిస్థితే ఉంటుందని  ట్వీట్ చేశారు.

చింతన్ శిబిర్ విఫ‌ల చింత‌న్ శిబిర్ అంటూ కౌంటర్ వేశారు. ప్ర‌స్తుత నాయ‌క‌త్వానికి కాస్త స‌మ‌యం ఇచ్చారు. రాబోయే గుజ‌రాత్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ఓడిపోయే వరకూ కాంగ్రెస్‌లో ఈ య‌థాతథ స్థితి ఇలాగే ఉంటుందని ట్వీట్ చేశారు. 

https://twitter.com/PrashantKishor/status/1527543808144994304

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కష్టాల్లో ఉన్న పార్టీని బతికించుకునేందుకు కొత్త వ్యూహకర్త కావాలని భావించి ప్రశాంత్‌ కిశోర్‌ను పార్టీలోకి కాంగ్రెస్ ఆహ్వానించింది. ఆయన కూడా వెంటిలేటర్‌ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో అధినాయకత్వంతో నాలుగైదు సార్లు భేటీ అయ్యారు. కానీ, ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరట్లేదని ప్రకటించారు. 

త్వరలోనే బీహార్‌ నుంచి ప్రజా ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నట్లు పీకే తెలిపారు. 3వేల కిలోమీటర్ల పాదయాత్రను అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజు ప్రారంభిస్తానని ప్రకటించారు. ఇప్పుడప్పుడే పార్టీ స్థాపనపై ఆలోచించడం లేదని ప్రజల్లో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని పీకే అన్నారు.