
ఆస్ట్రేలియాలో ఎన్నికల సందడి మొదలైంది. మే 17న సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నట్లు ఇవాళ (గురువారం) ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ అడ్మినిస్ట్రేషన్ పార్టీ పోటీ పడుతున్నాయి. ప్రతినిధుల సభలో 151 సీట్లుంటే , సెనేట్‌లో సగం అంటే 76 సీట్లు ఉన్నాయి. ఈ సారి ఎన్నికలు ఆస్ట్రేలియాలోని వాతావరణ మార్పులు, ఆర్థిక వ్యవస్థతో పోటీ పడుతున్నట్లుగా పలువురు నేతలు భావిస్తున్నారు. ఈ ఎన్నికలు తర్వాతి దశాబ్ధంలో ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థను నిర్ధారిస్తుందని ప్రధాని మోరిసన్ మీడియా సమావేశంలో తెలిపారు.