ఉద్ధండులు లేని ఎన్నికలు

ఉద్ధండులు లేని ఎన్నికలు

వారంతా రాజకీయాల్లో ఉద్ధండులు.. దశాబ్దాలుగా తమ రాజకీయాలను కనుసైగతో శాసించారు.ఎన్నికల్లో తమ పార్టీలను ముందుండి నడిపించారు. ఆయా రాష్ట్రా ల్లో తమదైన ముద్ర వేశారు. గతరెండు (2009, 2014 )సాధారణ ఎన్నికల్లోనూ క్రియాశీలకంగా పనిచేశారు. కానీ అలాంటిసీనియర్లలో కొందరు ఈసారి ఎలక్షన్లలో కనిపించడం లేదు. కొందరు అనారోగ్యం, ఇతర కారణాలతో కన్నుమూయగా.. మరికొందరుక్రియాశీల రాజకీయాలకు దూరమయ్యా రు.ఇలాంటి నేతల్లో కరుణానిధి, జయలలిత, గడ్డంవెంకటస్వామి(కాకా), మనోహర్‌ పారికర్‌ , బీజేపీనేత గోపీనాథ్‌ ముండే, విలాస్‌ రావు దేశ్‌ ముఖ్‌ తదితర ప్రముఖులు ఉన్నా రు. వీరిలో ‘కాకా’వంటివారు ఏడు దశాబ్దా లపాటు రాజకీయాల్లోఉండగా.. కొందరు రెండు, మూడు దశాబ్దాలుగా ప్రభావం చూపిస్తున్నవారు. వారు లేకుండాఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా పార్టీలకు పెద్ద దిక్కుగా నిలిచిన ఈ నేతలు ఇప్పుడు భౌతికంగా లేకున్నా వారి ఫొటోలు, కటౌట్లు ఎలక్షన్ల ప్రచారంలో కనిపి స్తున్నా యి.

కరుణ, జయ లేని తమిళ రాజకీయాలు

2016లో అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత,2018లో డీఎంకే అధినేత కరుణానిధి మరణించారు. తమిళనాడు రాజకీయాలను దశాబ్దాల పాటు ఏలిన ఈ ఇద్దరు ప్రముఖులు.. 2014 సాధారణ ఎన్నికల్లో నూ ప్రచారం హోరెత్తిం చారు. కానీ ఈసారి ఎన్నికల్లో ఆ ఇద్దరూ లేరు. దీంతో తమిళనాడులో పోటీ ఆసక్తికరంగా మారింది.అన్నా డీఎంకేలో జయలలిత వంటి జనాకర్షణ శక్తి కలిగిన నేత లేకపోవడంతో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఆ పార్టీ నేతలు నిర్ణయిం చారు. తన తండ్రి కరుణానిధి లేకపోవడంతో.. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ఒంటరిగా పోటీచేసే సాహసం చేయలేక కాం గ్రెస్‌ తో చేతులు కలిపారు.

గోవాలో పారికర్ .. మహారాష్ట్రలో ముండే..

2014 ఎన్నికల్లో గోవా రాష్ట్ర బీజేపీని ముందుండి విజయపథాన నడిపించిన ఆ రాష్ట్ర దివంగత సీఎం మనోహర్‌ పారికర్‌ లేకుం డా ఈసారి ఎన్నికలు జరుగుతున్నా యి. క్లోమగ్రంథి కేన్సర్‌ తో దీర్ఘకాలం బాధపడిన ఆయన గత నెలలో తుదిశ్వాస విడిచారు. నిరాడంబరత్వానికి నిలువెత్ తు నిదర్శనమైన పారికర్.. గోవాలో బీజేపీని ముందుండి నడిపించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇప్పుడాయన లేని లోటుగోవా రాజకీయాలపై స్పష్టం గా కనిపి స్తోంది. అలాగే మహారాష్ట్ర రాజకీయాల్లో తన ప్రత్యేకతను చాటిన బీజేపీ నేత గోపీనాథ్‌ ముండే కూడా ఈసారి లేరు. 2014 ఎన్నికల్లో గెలిచి, కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. మహారాష్ట్ర బీజేపీలో సీనియర్​ నేత అయిన గోపీనాథ్​ ముండే లేని లోటు కనిపిస్తోంది.

జనంలో లేని లాలూ

జబ్ తక్ సమోసా మే ఆలూ రహేగా.. తబ్ తక్బీహార్ మే లాలూ రహేగా’ అంటూ విభిన్నమైన ప్రసంగాలు చేసే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైలులో ఉండటంతో ఈసారి ఎన్నికల కు దూరమయ్యా రు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన లాలూ ప్రసంగాలు, ప్రచారం లేకుండానే ఈసారి ఆర్జేడీ ఎన్నికల బరిలోకి దిగిం ది. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. ప్రధాని మోదీ హావభావాలను, మాటలను అనుకరిస్తూ లాలూ చేసిన ప్రసంగం ఉర్రూతలూగించిం ది. అయితే దాణా కుంభకోణంలో జైలుశిక్ష పడటంతో 2017 నుంచి ఆయన రాం చీ జైల్లో ఉంటున్నా రు. అక్కడి నుంచే తన పార్టీకి దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. అయితే లాలూ లేకపోవడంతో ఆయన ఇద్దరు కుమారుల మధ్య విభేదాలు వచ్చాయి. పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వేరుగా పార్టీ పెట్టడంతో బిహార్​ రాజకీయం ఆసక్తిగా మారింది.

మరెం దరో సీనియర్లు..

చాలా ఏళ్లుగా దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన మరెందరో సీనియర్​ నేతలు కూడా ఈసారి ఎన్నికల్లో పోటీకి, ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. బీజేపీ అగ్రనేతలు అద్వానీ, మురళీమనోహర్​ జోషీ వంటి వారిని ఆపార్టీ టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టింది.

రాజకీయాలపై ‘కాకా’ముద్ర
‘కాకా’అంటూ అభిమానులు ఆత్మీయంగా పిలుచుకునే కాం గ్రెస్‌ దివంగత నేత గడ్డం వెంకటస్వామి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. పేదల పెన్నిధిగా పేరుప్రతిష్టలూ సంపాదిం చారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న కాకా.. తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. 1957లో తొలిసారి ఉమ్మడి ఏపీ శాసనసభకు, 1976లో లోక్‌‌సభకు ఎన్నికయ్యా రు. ఏడు సార్లు ఎంపీగా గెలిచారు.పలుదఫాలు కేం ద్ర మంత్రిగానూ పనిచే-
శారు. రాష్ట్రంలో తొలి ఎన్నికలు మొదలు 2014 సాధారణ ఎన్నికల దాకా కాం గ్రెస్‌ పార్టీలో క్రియాశీల పాత్ర పోషించారు.సుదీ ర్ఘకాలం ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగిన వెంకటస్వామి గత లోక్ సభ ఎన్నికలు జరిగిన కొద్ది నెలలకే కన్నుమూశారు.రాష్ట్రంలో ఆయన లేకుండా జరుగుతున్న
తొలి లోక్‌‌సభ ఎన్నికలు ఇవే.