టీ, కాఫీని చేతితో కలపక్కర్లేదు.. ఈ ఎలక్ట్రిక్ స్టిర్రర్ కాఫీ మగ్‌‌ కొనుక్కోండి.. అదే కలిపి వేడిగా ఇచ్చేస్తుంది !

టీ, కాఫీని చేతితో కలపక్కర్లేదు.. ఈ ఎలక్ట్రిక్ స్టిర్రర్ కాఫీ మగ్‌‌ కొనుక్కోండి.. అదే కలిపి వేడిగా ఇచ్చేస్తుంది !

ప్రతి ఇంట్లో ఉదయం టీ, కాఫీ, పాలు, ప్రొటీన్ షేక్, హెల్త్ డ్రింక్స్ తయారు చేస్తుంటారు. వాటిని చేతితో కలపడం బోరింగ్‌‌గా ఉంటుంది. పైగా సమయం పడుతుంది. అలాంటప్పుడు ఈ మగ్‌‌ని వాడితే సరిపోతుంది. దీన్ని జెనరిక్ అనే కంపెనీ మార్కెట్‌‌లోకి తీసుకొచ్చింది. దీనికి పోర్టబుల్ ఎలక్ట్రిక్ స్టిర్రర్ హ్యాండిల్ ఉంటుంది. అది 7000 ఆర్‌‌‌‌పీఎంతో తిరుగుతుంది.

కాబట్టి గ్లాసు లేదా కప్‌‌లో పెట్టి బటన్ నొక్కితే ఆటోమెటిక్‌‌గా అందులోని పానీయాన్ని కలిపేస్తుంది. ఈ హై-స్పీడ్ మిక్సింగ్ కప్పుని హై క్వాలిటీ ఫుడ్ గ్రేడ్ గ్లాస్‌‌తో తయారుచేశారు. 400 ఎంఎల్‌‌ కెపాసిటీతో వస్తుంది. దీని మూతని ప్లాస్టిక్‌‌తో తయారుచేశారు. ఇందులో రెండు రీచార్జబుల్‌‌ ఏఏఏ బ్యాటరీలు ఉంటాయి. వాటిని యూఎస్‌‌బీ చార్జింగ్‌‌ కేబుల్‌‌తో రీచార్జ్‌‌ చేసుకోవచ్చు.