అన్ని సర్కార్ ఆఫీసుల్లో కరెంటు బండ్లే

అన్ని సర్కార్ ఆఫీసుల్లో కరెంటు బండ్లే
  • ఈవీలకు మారాలని  సీఎంలకు లెటర్లు రాసిన కేంద్రం   

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌‌‌ (ఈవీ)ను ఎంకరేజ్‌‌‌‌ చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నాలను స్పీడప్‌‌‌‌ చేసింది.  ఇక నుంచి అన్ని కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల్లో ఈవీలను మాత్రమే వాడనున్నారు. 2070 నాటికి నెట్‌‌‌‌–జీరో ఎమిషన్‌‌‌‌ టార్గెట్‌‌‌‌ను చేరుకోవడానికి కేంద్రం పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌ బండ్లకు గుడ్‌‌‌‌బై చెప్పనుంది. రాబోయే మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వ ఆఫీసులతోపాటు, వీటి ఫీల్డ్ ఆఫీసుల్లోనూ ఈవీలు ఉంటాయని ఈ సంగతి తెలిసిన కొందరు ఆఫీసర్లు వెల్లడించారు. ఈ ప్లాన్‌‌‌‌ను అమలు చేయడానికి కేంద్రం ప్రయత్నాలను మొదలుపెట్టిందని చెప్పారు. అంతేకాదు సెంట్రల్‌‌‌‌ గవర్నమెంటు మినిస్ట్రీలతోపాటు రాష్ట్రాల సీఎంలూ.. మామూలు బండ్లకు బదులు ఈవీలు వాడాలని కేంద్ర విద్యుత్‌‌‌‌శాఖ మంత్రి రాజ్‌‌‌‌కుమార్‌‌‌‌ సింగ్‌‌‌‌ లెటర్లు రాశారు. డీజిల్‌‌‌‌ బండ్లను ఈవీలుగా మార్చాలని సూచించారు. ఇండియా అంతటా ఈవీల వాడకం మెల్లమెల్లగా పెరుగుతోంది కాబట్టి 2025 నాటికి వీటి ధరలు దిగొస్తాయని కేంద్రం భావిస్తోంది. 
మెట్రో సిటీలపై ఫోకస్‌‌‌‌...
కనీసం 40 లక్షలు,  అంతకంటే ఎక్కువ జనాభా కలిగిన మెట్రో సిటీల్లో ఈవీల వాడకాన్ని పెంచాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై, కోల్‌‌‌‌కతా, సూరత్,  పూణే సిటీలను ఇందుకోసం ఎంచుకుంది. ‘‘కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు,  వాటి ఫీల్డ్ ఆఫీసులకు భారీ సంఖ్యలో పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌ బండ్లు ఉన్నాయి  వీటిని ఈవీలుగా మార్చాలన్నది ప్రభుత్వ ఆలోచన. దీనివల్ల ఈవీ ఇండస్ట్రీకి మరింత సపోర్ట్‌‌‌‌ దొరుకుతుంది’’ అని సంబంధిత మంత్రిత్వశాఖలు తెలిపాయి. ఈవీల సంఖ్యను పెంచడానికి,   పబ్లిక్ ట్రాన్స్‌‌‌‌పోర్టులో ఈవీలను ప్రవేశపెట్టడానికి కేంద్రం ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్) స్కీమ్‌‌‌‌ను తీసుకొచ్చింది. ఈవీలను కొన్న వారికి కూడా ఈ పథకం కింద రాయితీలను ఇస్తోంది. ఇందుకు రూ.10వేల కోట్లు కేటాయించింది. చార్జింగ్‌‌‌‌ స్టేషన్లను నిర్మించేందుకు కూడా తోడ్పాటును ఇస్తోంది. వెహికల్స్‌‌‌‌ ఎమిషన్స్‌‌‌‌లను (ప్రమాదకర వాయువులు), పెట్రో ప్రొడక్టుల వాడకాన్ని తగ్గించడం, కరెంటు బండ్ల వాడకాన్ని పెంచడానికి ఫేమ్‌‌‌‌ను విస్తరించాలని కోరుకుంటోంది.  ఫేమ్-–2 కోసం కేటాయించిన డబ్బును 500 వేల ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు, 10 లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్లు, 55 వేల ఎలక్ట్రిక్ కార్లు, 7,090 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు సబ్సిడీ ఇవ్వడానికి ఖర్చు చేస్తుంది. ఈవీలు పెరిగితే సహజంగానే భారతదేశంలో పెట్రోల్  డీజిల్‌‌‌‌కు డిమాండ్‌‌‌‌ తగ్గుతుంది. “రాబోయే పదేళ్లలో పెట్రోల్,  డీజిల్‌‌‌‌ డిమాండ్  ఏటా 1.5 శాతం మేర తగ్గుతుందని అంచనా.  గత పదేళ్లలో  ఇది 4.9 శాతం తగ్గింది. 2070 నాటికి  నెట్‌‌‌‌జీరో ఎమిషన్స్‌‌‌‌ను ఇండియా టార్గెట్‌‌‌‌గా చేసుకున్నందున ఈవీలు భారీగా పెరుగుతాయి”అని రేటింగ్‌‌‌‌ ఏజెన్సీ క్రిసిల్  తెలిపింది. 
ఒప్పో నుంచి ఎలక్ట్రిక్‌‌ కారు
స్మార్ట్‌‌ఫోన్ల తయారీ కంపెనీ ఒప్పో ఈవీల సెగ్మెంట్లోకి రావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. తన పేరెంట్‌‌ కంపెనీ బీబీకే ఎలక్ట్రానిక్స్ ఇందుకోసం ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ అందిస్తుంది. 2024 నాటికి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కారును రోడ్లపైకి తేవడంపై ఫోకస్​ చేసింది. ఇండియా తనకు భారీ మార్కెట్‌‌ అని ఈ కంపెనీ 
భావిస్తోంది. మనదేశంలోనే కారును లాంచ్‌‌చేసే అవకాశాలు ఉన్నాయి.  ప్రస్తుతం, ఒప్పోకు  గ్రేటర్ నోయిడాలో భారీ ప్లాంటు ఉంది. ఇక్కడ తన సొంత బ్రాండ్‌‌ ప్రొడక్టులతోపాటు వన్‌‌ప్లస్‌‌, రియల్‌‌మీ కోసం స్మార్ట్‌‌ఫోన్‌‌లు, ఇతర ఐఓటీ ప్రొడక్టులను తయారు చేస్తోంది. ఒప్పోతోపాటు, వివో, వన్‌‌ప్లస్‌‌, రియల్‌మీ, ఐక్యూ కంపెనీలు కూడా బీబీకే ఎలక్ట్రానిక్స్‌‌ గ్రూపు కంపెనీలే!  ఒప్పో,  రియల్‌‌మీ కూడా ఈవీలను డెవలప్‌‌ చేయాలని అనుకుంటున్నాయి. ఈ-స్కూటర్, ఈ-మోటార్ సైకిళ్లను, ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయనున్నాయి. అమెరికా కంపెనీలు యాపిల్‌‌, గూగుల్‌‌ కూడా ఇప్పటికే ఎలక్ట్రిక్‌‌ కార్లపై ఫోకస్‌‌ చేశాయి. త్వరలోనే అవి రోడ్లపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్మార్ట్‌‌ఫోన్ తయారీదారులకు ఇప్పటికే ఈవీల తయారీకి అవసరమైన టెక్నాలజీ, ఎక్విప్‌‌మెంట్‌‌ ఉంటుంది కాబట్టి కరెంటు బండ్లను తయారు చేయడం వీటికి ఈజీ అని ఎక్స్‌‌పర్టులు చెబుతున్నారు.   కొన్ని మార్పులు చేస్తే చాలని అంటున్నారు.