ఏసీలు, రిఫ్రిజిరేటర్లు పిరం!

ఏసీలు, రిఫ్రిజిరేటర్లు పిరం!
  • మార్చిలోపు 10 % వరకు రేట్లను పెంచాలని చూస్తున్న కంపెనీలు
  • ముడిసరుకుల ధరలు, రవాణా ఖర్చులు ఎక్కువవ్వడమే కారణం
  • కరోనా రిస్ట్రిక్షన్లతో తగ్గుతున్న ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్ల రేట్లు ఈ ఏడాది మార్చిలోపు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామెటీరియల్స్ ధరలు పెరగడంతో పాటు, గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా, లోకల్‌‌‌‌గా రవాణా ఖర్చులు ఎక్కువవ్వడంతో హోమ్ అప్లియెన్స్‌‌‌‌ల ధరలను 5 నుంచి 10 శాతం వరకు పెంచుతామని  టాప్ కంపెనీలు చెబుతున్నాయి. వీటికి తోడు కరోనా కేసులు పెరుగుతుండడంతో చాలా రాష్ట్రాల్లో రిస్ట్రిక్షన్లు పెట్టడం స్టార్ట్‌‌‌‌ అయ్యింది. దీంతో మ్యాన్ పవర్ దొరకడం లేదని, ప్రొడక్షన్ 25 శాతం తగ్గిందని కంపెనీలు చెబుతున్నాయి. కన్జూమర్ డ్యూరబుల్స్‌‌‌‌లో వాడే ప్లాస్టిక్‌‌‌‌, మెటల్స్ రేట్లు 70 శాతం మేర పెరిగాయని, సెమీకండక్టర్ల కాస్ట్‌‌‌‌ కూడా ఎక్కువయ్యిందని వాపోతున్నాయి. పానాసోనిక్‌‌‌‌, ఎల్‌‌‌‌జీ, హాయర్‌‌‌‌, సోనీ, హిటాచి, గోద్రేజ్‌‌‌‌ అప్లియెన్సెస్‌‌‌‌ వంటి కంపెనీలు రేట్లను పెంచుతామనే సిగ్నల్స్‌‌‌‌ ఇచ్చాయి. ‘కమోడిటీల ధరలు పెరగడంతో పాటు, రవాణా ఖర్చులు, ముడిసరుకుల ఖర్చులు పెరగడంతో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్ల సెగ్మెంట్లలోని ప్రొడక్ట్‌‌‌‌లపై రేట్లను 3–5 శాతం పెంచుతాం’ అని హాయర్‌‌‌‌‌‌‌‌ అప్లియెన్స్‌‌‌‌స్‌‌‌‌ ఇండియా ప్రెసిడెంట్‌‌‌‌ సతీష్‌‌‌‌ ఎన్‌‌‌‌ ఎస్‌‌‌‌ పేర్కొన్నారు. 

పానాసోనిక్ ఇప్పటికే తమ ఏసీలపై 8 శాతం రేట్లను పెంచింది. రేట్లను మరింత పెంచాలని కూడా ఆలోచిస్తోంది. ఇతర హోమ్‌‌‌‌ అప్లియెన్స్‌‌‌‌ల రేట్లను కూడా పెంచుతామని కంపెనీ చెబుతోంది. సౌత్‌‌‌‌ కొరియన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎల్‌‌‌‌జీ కూడా రేట్లను పెంచే పనిలో ఉంది. ముడిసరుకుల ధరలు,  రవాణా ఖర్చులు పెరగడంతో రేట్లను పెంచక తప్పడం లేదని చెబుతోంది. ముడిసరుకుల రేట్లు పెరిగినా, రేట్లను కంట్రోల్‌‌‌‌లో ఉంచడానికే ప్రయత్నించామని ఎల్‌‌‌‌జీ ఎలక్ట్రానిక్స్ వైస్ ప్రెసిడెంట్‌‌‌‌ దీపక్‌‌‌‌ బన్సాల్‌‌‌‌ అన్నారు. తమ బిజినెస్‌‌‌‌ సస్టయిన్ కావాలంటే రేట్లను పెంచక తప్పదని చెప్పారు. ఏసీల ధరలను  10 శాతం వరకు పెంచుతామని జాన్సన్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ ఉన్న  హిటాచి పేర్కొంది. దశల వారీగా రేట్లను పెంచుతామని, ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌లోపు ఈ పెంపు ఉంటుందని పేర్కొంది.  రామెటీరియల్స్‌‌‌‌ ఖర్చులు, ట్యాక్స్‌‌‌‌లు, ట్రాన్స్‌‌‌‌పోర్టేషన్  ఖర్చులు పెరగడంతో రేట్లను పెంచాల్సి వస్తోందని వివరించింది. 

ఫెస్టివ్ సీజన్‌‌‌‌ కోసం ఇప్పటి వరకు రేట్లు పెంచలే!

ఫెస్టివ్ సీజన్‌‌‌‌ వలన  ఇప్పటి వరకు కంపెనీలు రేట్లను పెంచకుండా వాయిదా వేస్తూ వచ్చాయని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్‌‌‌‌ అండ్ అప్లియెన్సెస్‌‌‌‌ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీఈఏఎంఏ) ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా అన్నారు.  కంపెనీని బట్టి ఈ రేట్ల పెంపులో  మార్పులుంటాయని, ఇప్పటికే కొన్ని కంపెనీలు ధరలను పెంచాయని అన్నారు. మరికొన్ని కంపెనీలు రేట్లను పెంచే పనిలో ఉన్నాయని చెప్పారు. డిమాండ్ తగ్గినా, రామెటీరియల్స్‌‌‌‌ ధరలు దిగొచ్చినా ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌ లేదా మే టైమ్‌‌‌‌లో రేట్లను కంపెనీలు తగ్గించొచ్చని బ్రగాంజా అభిప్రాయపడ్డారు.  సోని, గోద్రేజ్‌‌‌‌ అప్లియెన్సెస్ వంటి కంపెనీలు రేట్ల పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పాయి.

ధరలు తగ్గడమనేది ఇప్పటిలో జరగదని, రేట్లు పెరగొచ్చని సోని ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సునిల్ నాయర్ అన్నారు. కరోనా కేసులు పెరుగుతుండడం వలన డిమాండ్ తగ్గుతోందని,  రేట్లను పెంచడంపై  త్వరలో  నిర్ణయం తీసుకుంటామని గోద్రేజ్ అప్లియెన్స్‌‌‌‌ బిజినెస్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది అన్నారు. థామ్సన్‌‌‌‌, బ్లపంక్ట్‌‌‌‌, కోడక్‌‌‌‌, వైట్–వెస్టింగ్‌‌‌‌హౌస్ వంటి బ్రాండ్లకు లైసెన్స్‌‌‌‌ పొందిన సూపర్ ప్లాస్ట్రోనిక్స్‌‌‌‌ కూడా రేట్లు పెంపు తప్పకపోవచ్చనే అంచనా వేసింది.  కన్జూమర్ ఎలక్ట్రానిక్స్‌‌‌‌లో అన్ని లెవెల్‌‌‌‌లోని ప్రొడక్ట్‌‌‌‌ల రేట్లు పెరుగుతాయని కిందటి క్వార్టలోనే అంచనా వేశామని పేర్కొంది. ఈ నెల రేట్లను పెంచమని, మిగిలిన కంపెనీల రేట్ల పెంపును గమనిస్తామని దైవా, షిన్కో వంటి బ్రాండ్‌‌‌‌లను తీసుకొస్తున్న వీడియోటెక్స్‌‌‌‌ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఏం చేయాలనేది ఆ తర్వాత నిర్ణయిస్తామని పేర్కొంది.