ఈసీఐఎల్‌‌లో అప్రెంటిస్‌‌ ఖాళీలు

ఈసీఐఎల్‌‌లో అప్రెంటిస్‌‌ ఖాళీలు

హైదరాబాద్‌‌లోని ఎలక్ట్రానిక్స్‌‌ కార్పొరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా లిమిటెడ్‌‌(ఈసీఐఎల్‌‌) 2022–-23 సంవత్సరానికి 212 అప్రెంటిస్‌‌ ఖాళీల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.

ఖాళీలు: ఇంజినీరింగ్‌‌ గ్రాడ్యుయేట్‌‌ అప్రెంటిస్‌‌షిప్‌‌ విభాగంలో 150 ఖాళీలు, డిప్లొమా అప్రెంటిస్‌‌షిప్‌‌ విభాగంలో 62 పోస్టులు ఉన్నాయి.

అర్హత: అప్రెంటిస్‌‌షిప్‌‌ను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌‌లో బీఈ/ బీటెక్‌‌/ డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి. వయసు 25 ఏళ్లు మించకూడదు. ఏడాది పాటు అప్రెంటిస్​షిప్​ ఉంటుంది.

సెలెక్షన్​: క్వాలిఫైయింగ్‌‌ పరీక్షలో మెరిట్‌‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆన్​లైన్​లో డిసెంబర్ 26 వరకు దరఖాస్తు చేసుకోవాలి.  పూర్తి వివరాలకు www.ecil.co.in వెబ్​సైట్ సంప్రదించాలి