ఫొటోలు తీస్తున్న వ్యక్తిని తరిమేసిన ఏనుగు

ఫొటోలు తీస్తున్న వ్యక్తిని తరిమేసిన ఏనుగు

ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరులో ఏనుగు హల్ చల్ చేసింది. జాతీయ రహదారిపై ఒంటరిగా వెళ్తున్న ఏనుగును ఫొటోలు తీసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. దీంతో ఏనుగు ఆ వ్యక్తి వెంటపడింది. ఆ యువకుడు పరుగులు పెడుతూ ఏనుగు నుంచి తప్పించుకున్నాడు.

ఇటీవల కాలంలో చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం ఎక్కువైందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఏనుగులు పంటలను నాశనం చేస్తూ మనుషులను చంపేస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి ఏనుగుల గుంపు నివాసాల్లోకి రాకుండా చూడాలని జనం కోరుతున్నారు.