
హైదరాబాద్, వెలుగు: ఎలైట్ విమెన్స్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో వరల్డ్ చాంపియన్స్ నిఖత్ జరీన్, లవ్లీనా బొర్గోహైన్, నీతూ ఘంగాస్, సవీటీ బూరా గోల్డ్ మెడల్‌కు ఒక్క పంచ్ దూరంలో నిలిచారు. తమ వెయిట్ కేటగిరీల్లో ఫైనల్ చేరుకున్నారు.
సొంతగడ్డపై మరోసారి తన మార్క్ చూపెట్టిన నిఖత్ జరీన్ (51కేజీ) సోమవారం (జులై జరిగిన సెమీస్‌లో 5–0తో వి.లక్షయను చిత్తు చేసింది. ఫైనల్లో రైల్వేస్ బాక్సర్ జ్యోతితో టైటిల్ పోరుకు సిద్ధమైంది. 75కేజీ సెమీస్‌లో లవ్లీనా యూపీకి చెందిన స్నేహను ఓడించగా.. నీతూ (48కేజీ) 5–0తో మంజు రాణి (రైల్వేస్)ని చిత్తు చేసింది.
సవీటీ బూరా (80కేజీ) 5–0తో ఆలిండియా పోలీస్ బాక్సర్ బబితా బిస్త్‌పై ఏకపక్ష విజయం సాధించింది. అంకుషిత బోరో (65కేజీ), ప్రీతి (54కేజీ), బబీరోజ్‌సనా చాను (57కేజీ), కమల్‌జీత్ కౌర్ (57 కేజీ), అల్ఫియా పఠాన్ (80కేజీ), రితికా (+80కేజీ) కూడా సెమీస్‌లో గెలిచి ఫైనల్లో అడుగు పెట్టారు.