అంధకారంలో ఎల్కతుర్తి బస్టాండ్ జంక్షన్

అంధకారంలో ఎల్కతుర్తి బస్టాండ్ జంక్షన్

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి బస్టాండ్​ జంక్షన్​అంధకారంగా మారింది. కుడా ఆధ్వర్యంలో జంక్షన్​సుందరీకరణ పనులు చేపట్టగా, సెంట్రల్​లైటింగ్​సిస్టం ఏర్పాటు చేసి కనెక్షన్​ ఇవ్వకపోవడంతో రాత్రి అయ్యిందంటే చాలు చీకట్లు కమ్ముకుంటున్నాయి. సిద్దిపేట, కరీంనగర్​, హనుమకొండ వైపు నుంచి ఎల్కతుర్తికి వచ్చి చుట్టుపక్కల ఊర్లకు వెళ్లే ప్రయాణికులు చీకట్లో ఇబ్బందులు పడుతున్నారు.

సైన్​బోర్డులు సైతం ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు ఏ దారి ఎటు వెళ్తుందో తెలియక అయోమయంలో పడిపోతున్నారు. అధికారులు స్పందించి లైట్లు వెలిగేలా చూడాలని, సైన్​బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.  – ఎల్కతుర్తి, వెలుగు