ట్విట్టర్ బ్లూ వెరిఫైడ్ రీలాంచ్‌‌ను వాయిదా వేసిన ఎలాన్ మస్క్

ట్విట్టర్ బ్లూ వెరిఫైడ్ రీలాంచ్‌‌ను వాయిదా వేసిన ఎలాన్ మస్క్

అపర కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి ట్విస్ట్ ఇచ్చాడు. బ్లూ టిక్ వెరిఫికేషన్ ప్లాన్ ను మరోసారి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్ పునఃప్రారంభించడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు మస్క్ ట్వీట్ చేశారు. అంతే కాకుండా ఈ బ్లూ టిక్ వెరిఫికేషన్ రీలాంచ్ ను ఆపేయడం వల్ల అకౌంట్ల తొలగింపుపై పూర్తి నమ్మకం వచ్చే వరకు దీన్ని వాయిదా వేస్తున్నానన్నారు. దాంతో పాటు వ్యక్తుల కోసం కాకుండా సంస్థల కోసం వేర్వేరు కలర్స్ లో వెరిఫికేషన్ ఉంటే బాగుంటుందేమో అంటూ మస్క్ రాసుకొచ్చారు. అయితే మళ్లీ ఎప్పుడు రీలాంచ్ చేస్తారన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. 

ట్విట్టర్ అకౌంట్ కు బ్లూ టిక్ ఫీజును నెలకు 8 డాలర్లుగా నిర్ణయించిన ఎలాన్ మస్క్.. నకిలీ ఖాతాలను గుర్తించే పనిలో పడ్డారు. అయితే ఆ సబ్ స్క్రిప్షన్ ఫీజు నవంబరు 29నుంచి అమల్లోకి వస్తుందని ముందే ప్రకటించినా.. తాజాగా చేసిన మస్క్ ప్రకటనతో మరోసారి ఈ నిర్ణయానికి బ్రేకులు పడ్డాయి.