చరిత్ర సృష్టించిన ఎలాన్ మస్క్.. 500 బిలియన్ డాలర్స్ మార్క్ దాటిన మొదటి బిలియనీర్

చరిత్ర సృష్టించిన ఎలాన్ మస్క్.. 500 బిలియన్ డాలర్స్ మార్క్ దాటిన మొదటి బిలియనీర్

ప్రపంచంలో అత్యంత ధనవంతుడు, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్.. మరో చరిత్ర సృష్టించారు. చరిత్రలో 500 బిలియన్ డాలర్లు దాటిని మొట్ట మొదటి కుబేరుడిగా రికార్డు సృస్టించారు. అంటే 4 వందల 15 లక్షల కోట్లు లేదా4.15 కోట్ల కోట్ల ఆస్తిని పోగేసిన శ్రీమంతుడు. 

ఫోర్బ్స్ లెక్కల ప్రకారం మస్క్ హాఫ్-ట్రిలియన్ మార్కును చేరుకున్నారు. త్వరలోనే ట్రిలియన్ డాలర్ల మైలురాయిని రీచ్ కానున్నారు. బుధవారం (అక్టోబర్ 01) మధ్యాహ్నం 3 గంటల 55 నిమిషాలకు మస్క్ ఆదాయం 499.5 బిలియన్ డాలర్లను చేరుకుంది. 

యూఎస్ మార్కెట్లో టెస్లా స్టాక్ పుంజుకోవడం ఒక్కసారిగా సంపద పెరిగిపోయింది. దీంతో సేస్ ఎక్స్ (SpaceX), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్ అప్ xAI వంటి కంపెనీల వాల్యువేషన్స్ భారీగా పెరిగిపోయాయి. 

మస్క్ కు అత్యంత సంపద క్రియేట్ చేసిన కంపెనీల్లో టెస్లా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. టెస్లా కార్ల మార్కెట్ విస్తరిస్తుండటం, స్పేస్ ఎక్స్, ఏఐ మొదలైన అన్ని బిజినెస్ లు జూమ్ అవుతుండటంతో త్వరలోనే ట్రిలియన్ డాలర్ల సంపాదనకు రీచ్ అవుతారని ఫోర్బ్స్ అంచనా వేసింది. 

ఇక ఫోర్బ్స్ లెక్కల ప్రకారం రెండో బిలియనీర్ గా ఒరాకిల్ కోఫౌండర్ లార్రీ ఎలిసన్ నిలిచారు. ఈయన నెట్ వర్త్ 351.5 బిలియన్ యూఎస్ డాలర్లు. అంటే 29 లక్షల 17 వేల 450 కోట్ల రూపాయలు.