ట్విట్టర్ లో 3,738 ఉద్యోగులకు ఎసరు

ట్విట్టర్ లో 3,738 ఉద్యోగులకు ఎసరు

న్యూఢిల్లీ: పెద్ద మొత్తంలో ట్విట్టర్ ఉద్యోగులను తీసేయడానికి ఎలన్ మస్క్ రెడీ అవుతున్నారు. ఇందుకు గాను సుమారు 3,738 మంది ఉద్యోగులకు మెయిల్స్ వచ్చినట్టు న్యూయార్క్‌‌‌‌ టైమ్స్‌‌ పేర్కొంది. ఉద్యోగులను భారీగా తొలగించడాన్ని మస్క్ నాయకత్వంలోని ట్విట్టర్‌‌‌‌ శుక్రవారం ప్రారంభించిందని ఈ సంస్థ రిపోర్ట్ చేసింది.   సరిగ్గా వారం రోజుల క్రితం ట్విట్టర్‌‌‌‌ను మస్క్ కొనుగోలు చేశారు. వెంటనే కంపెనీ సీఈఓ పరాగ్ అగర్వాల్‌‌ను, లీగల్ ఎగ్జిక్యూటివ్‌‌ విజయ గద్దెను, సీఎఫ్‌ఓ నెడ్‌‌ సెగెల్‌‌ను, జనరల్ కౌన్సిల్ మెంబర్ సీన్ ఎడ్‌‌గెట్‌‌ను ఆయన తీసేశారు. ‘ఉద్యోగాల నుంచి తీసేయడంపై ట్విట్టర్ ఉద్యోగులకు ఈ–మెయిల్స్‌‌ ద్వారా నొటిఫై చేశారు’ అని న్యూయార్క్ టైమ్స్‌‌ పేర్కొంది.

‘ట్విట్టర్‌‌‌‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు గ్లోబల్‌‌గా ఉన్న  ఉద్యోగులను తగ్గించుకోవాలని చూస్తున్నాం’ అని ఈ  ఈమెయిల్‌‌లో ఉన్నట్టు వివరించింది.  ప్రస్తుతం నెలకు కొన్ని రోజుల పాటు ట్విట్టర్ ఉద్యోగులు రెస్ట్ తీసుకోవడానికి అవకాశం కలిపిస్తున్నారు. దీన్ని ట్విట్టర్ తొలగించింది. సుమారు సగం మంది ఉద్యోగులను తీసేయడానికి రెడీ అవుతున్న ట్విట్టర్‌‌‌‌కు వ్యతిరేకంగా  శాన్‌‌ప్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో కేసు ఫైల్ అయ్యింది.  వార్న్‌‌ యాక్ట్ ప్రకారం, ప్లాంట్‌‌ను క్లోజ్‌‌ చేసినా లేదా పెద్ద మొత్తంలో ఉద్యోగులను తీసేసిన ముందుగానే నోటిఫై చేయాలి. అటర్నీ శానన్‌‌ లిస్‌‌ రియోర్డన్ ఈ కేసును ఫైల్ చేయగా, వార్న్‌‌ యాక్ట్‌‌ను  ట్విట్టర్ ఫాలో కావాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ట్విట్టర్ వెబ్‌‌ సర్వీసెస్‌‌ శుక్రవారం కొంత టైమ్‌‌ పనిచేయలేదు.