
చండూరు, వెలుగు : ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ పనులను మూడు నెలల్లో పూర్తి చేస్తానని ఈఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ ఇరుగుదిండ్ల భాస్కర్ తెలిపారు. గురువారం చండూరు పట్టణంలో అసంపూర్తిగా ఉన్న ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ ఫౌండేషన్ తరపున యువకులకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.
జర్నలిస్టులకు ఆరోగ్య బీమా కల్పిస్తానని చెప్పారు. భవిష్యత్లో తమ ఫౌండేషన్ చేపట్టబోయే సేవా కార్యక్రమాలు నిజమైన పేదవానికి దక్కేవిధంగా జర్నలిస్టులు సహకరించాలని కోరారు.