ఈ నెల 4 నుంచి ఎంసెట్‌‌‌‌ వెబ్‌‌‌‌ ఆప్షన్లు

ఈ నెల 4 నుంచి ఎంసెట్‌‌‌‌ వెబ్‌‌‌‌ ఆప్షన్లు

హైదరాబాద్, వెలుగు: టీఎస్‌‌‌‌ ఎంసెట్‌‌‌‌ అడ్మిషన్ల కోసం​ఈ  నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చినట్లు టెక్నికల్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ నవీన్‌‌‌‌ మిట్టల్‌‌‌‌ తెలిపారు. సోమవారం నుంచి రిజిస్ర్టేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 26,853 మంది సర్టిఫికెట్ల కోసం స్లాట్‌‌‌‌ బుక్‌‌‌‌ చేసుకున్నారని చెప్పారు. స్లాట్‌‌‌‌ బుకింగ్‌‌‌‌కు​ ఈ నెల 9 వరకు అవకాశముందని తెలిపారు. స్టూడెంట్లు ఈ విషయాన్ని గుర్తించి ఆలోగా స్లాట్​ బుక్​ చేసుకోవాలని సూచించారు.