ఎమోషనల్‌‌‌‌గా కనెక్ట్ అయ్యే సార్

ఎమోషనల్‌‌‌‌గా కనెక్ట్ అయ్యే సార్

తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్‌‌‌‌ దే లాంటి లవ్‌‌‌‌స్టోరీలతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న వెంకీ అట్లూరి.. ధనుష్‌‌‌‌తో ‘సార్’ అనే సోషల్ డ్రామా తెరకెక్కించాడు.  సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మించిన ఈ  చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా వెంకీ అట్లూరి మాట్లాడుతూ ‘మూడు ప్రేమకథలు తీశాను. ఈసారి ప్రేక్షకులకు కొత్తదనం చూపించాలి అనుకున్నా. సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూసి.. విద్య నేపథ్యంలో సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. నా ఎడ్యుకేషన్ అంతా  90లలో సాగింది. ఆ సమయంలో నాకు ఎదురైన అనుభవాలు, నేను చూసిన ఇన్సిడెంట్స్‌‌‌‌ ఆధారంగా ఈ కథ రాసుకున్నా.1990లో జరిగే కథ అయినా.. ఇప్పటికీ అవే పరిస్థితులు కొనసాగుతున్నాయి.

చదువు అనేది నిత్యావసరంగా మారింది. అందుకే ఈ సబ్జెక్ట్ మనసున్న ప్రతి మనిషికి  నచ్చుతుంది. స్టూడెంట్స్, పేరెంట్స్‌‌‌‌కి అందరికీ ఎమోషనల్‌‌‌‌గా కనెక్ట్ అవుతుంది.  ధనుష్ గారికి కథ చెప్పగానే క్లాప్స్ కొట్టి డేట్స్ ఎప్పుడు కావాలి అనడంతో ఆనందం కలిగింది. సుమంత్, సముద్రఖని పాత్రలు సినిమాకు హైలైట్‌‌‌‌. సితార నాకు హోమ్ బ్యానర్ లాంటిది. నిర్మాత వంశీ  చాలా మంచి స్నేహితుడు. త్రివిక్రమ్ గారంటే ప్రత్యేక అభిమానం. వారితో కలిసి పని చేయడం నాకెప్పుడూ సంతోషాన్ని ఇస్తుంది. సినిమాకొస్తున్న రెస్పాన్స్ పట్ల చాలా హ్యాపీగా ఉంది’ అని చెప్పాడు.