V6 News

రాష్ట్రంలో 115 ATC సెంటర్ల ద్వారా యువతకు ఉపాధి : మంత్రి వివేక్

రాష్ట్రంలో 115 ATC సెంటర్ల ద్వారా యువతకు ఉపాధి :  మంత్రి వివేక్

రాష్ట్రంలో యువతకు ఉపాధి అందించడమే లక్ష్యంగా 115 ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు మంత్రి వివేక్. వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా.. పరిగి సస్కల్ లో 45 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఏటీసీ సెంటర్ కు శనివారం (డిసెంబర్ 13) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. ఏటీసీ సెంటర్ల ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. గతంలో బీఆర్ఎస్  ప్రభుత్వం ITI  లను పట్టించుకోలేదని.. సుమారు 4 వేల కోట్ల రూపాయలతో ఏటీసీలను టాటాల భాగస్వామ్యంతోఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 

మంత్రి వివేక్ కామెంట్స్:

  • BRS ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది...
  • నెలకు 500 కోట్ల రూపాయలవడ్డీలు కడుతున్నం....
  • పదేళ్ళలో ఒక్క డబుల్ బెడ్రూం కూడా ఇవ్వలే
  • అవన్నీ అధిగమించేందుకు రేవంత్ ప్రభుత్వం పని చేస్తోంది.
  • కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక విడతల వారిగా ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నాం
  • అర్హులకు మరో 3500 ఇండ్లు ఇస్తాం....
  • ఇప్పటి వరకు లక్ష ఉద్యోగాలు కల్పించాం.
  • నేను కూడా పారిశ్రామిక వేత్తను.. నాకు 14 రాష్ట్రాల్లో ఇండస్ట్రీస్ ఉన్నాయి.. చాలా సవాళ్లు ఉంటాయి
  • పరిగిలో రామ్మోహన్ రెడ్డి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు
  • పేద ప్రజలు విద్యా, వైద్యం కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు.. వారి కోసమే ఎక్కువ ప్రాజెక్ట్స్ తెస్తున్నారు
  • ఇందిరా గాంధీ ఆ రోజుల్లో గరీభీ హటావో పథకం తెచ్చి పేదలకు స్థలాలు, ఇండ్లు ఇచ్చారు
  • తెలంగాణ ప్రజా ప్రభుత్వం కూడా పేదల కోసం అనేక పథకాలు తెచ్చింది.

పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కామెంట్స్:

  • వివేక్ గారు పరిశ్రమలు ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు 
  • కాకా ఫ్యామిలీకి సోనియా కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉంది.. 
  • కాకా కుటుంబం తెలంగాణకు ఎనలేని సేవలు చేసింది 
  • రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మంత్రి వివేక్ గారు సమసమాజం కోసం కృషి చేస్తున్నారు 
  • అభివృద్ధి చెందుతున్న దేశాలు పారిశ్రామికంగా ముందుకు వెళ్తున్నాయి
  • వ్యవసాయం సరిగా లేక చాలా దేశాలు చిన్నభిన్నం అవుతున్నాయి..
  • కుటుంబాలను ముందుకు తీసుకెళ్లాలంటే ఉపాధి అవసరం
  • పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలి...
  •  ఇంతకు ముందు ITI లు ఉండేవి.. వాటిని ATC లు గా మర్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం